Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్​ఫోన్ కొందామంటే ధర ఎక్కువని ఆగిపోయారా ? అయితే మీకో శుభవార్త...

'వన్​ప్లస్' స్మార్ట్​ఫోన్ కొందామంటే ధర ఎక్కువని ఆగిపోయారా? అయితే మీకో శుభవార్త. ఇప్పటివరకు ప్రీమియం స్మార్ట్​ఫోన్​లకు మాత్రమే పరిమితమైన వన్​ప్లస్ ఇప్పుడు మిడ్​ రేంజ్​లో ఓ కొత్త మోడల్​ను అవిష్కరించేందుకు సిద్ధమైంది. 
 

OnePlus 8 Lite Specs And Price: To Launch Under 20,000?
Author
Hyderabad, First Published Dec 13, 2019, 11:02 AM IST

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్ తయారీ దగ్గజం 'వన్​ప్లస్'​ మరోసారి మిడ్‌రేంజ్​​ మోడల్​ను భారత విపణిలోకి తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రీమియం మోడళ్లతో ఆపిల్, శామ్‌సంగ్, హువావే వంటి సంస్థలకు వన్​ప్లస్ గట్టిపోటీ ఇవ్వనున్నది.​

also read  ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా...?

తాజాగా వన్ ప్లస్ కంపెనీ మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లోని ఇతర కంపెనీలపై గురి పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మిడ్ రేంజ్​ స్మార్ట్​ఫోన్ 2020 రెండో అర్ధభాగంలో వన్​ప్లస్​ 8 మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నది. ఇందులో వన్​ప్లస్​ 8, వన్​ప్లస్​ 8 ప్రో ఉండనున్నాయి.

OnePlus 8 Lite Specs And Price: To Launch Under 20,000?

వీటితోపాటే 'వన్​ప్లస్​ 8 లైట్'​ మోడల్​ను మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో మార్కెట్లోకి తీసుకురానున్నదని టెక్ వార్తా సంస్థలు అంటున్నాయి. వన్​ప్లస్​ నుంచి ఇదివరకే.. 'వన్​ప్లస్​ ఎక్స్' పేరుతో మిడ్​ రేంజ్​లో ఓ స్మార్ట్ ఫోన్ మోడల్​ మార్కెట్లో విడుదలైంది. అయితే ఈ మోడల్​కు మార్కెట్లో అనుకున్న డిమాండ్ రాలేదు. అప్పటి నుంచి వన్ ప్లస్ ప్రీమియం సెగ్మెంట్​కు మాత్రమే పరిమితమైంది.

తాజాగా వన్ ప్లస్ మళ్లీ ఇప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త మోడల్​ను మిడ్​ రేంజ్​లో తీసుకువచ్చి విజయం అందుకోవాలని ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది రాబోతున్న వన్​ప్లస్​ 8, 8 ప్రో మోడళ్లు 3డీ రెండర్స్​, పంచ్ హోల్​ కెమెరా, ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ ప్రింట్ సెన్సర్​​తో రానున్నాయి. వన్​ప్లస్​ 8 లైట్​లోనూ ఇవే ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. 

also read సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్‌...ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ చేయవచ్చు...

వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్ సాఫ్ట్​వేర్​ ఎలా ఉండబోతోంది, ధర ఎంత వంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. వన్​ప్లస్​ మొబైళ్లు ఈ స్థాయిలో విజయం సాధించేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఆక్సిజన్​ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్​)​. ఆండ్రాయిడ్ ఓఎస్​కు చెందిన ఉత్తమ ఓఎస్​గా దీనికి పేరుంది. ఈ కారణం వల్లే ఆక్సిజన్​ ఓఎస్​తో మిడ్ రేంజ్​లో వచ్చే.. వన్​ప్లస్8 లైట్​కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండొచ్చని స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ వర్గాలు అంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios