Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్ కార్ట్ నయా రికార్డ్

దసరా పండగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డే’ సేల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈనెల 10 నుంచి ఈ ఆఫర్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 

One million smartphones sold on Flipkart in first hour of sales
Author
Hyderabad, First Published Oct 12, 2018, 2:50 PM IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నయా రికార్డ్ సృష్టించింది. అది కూడా స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో రికార్డు సాధించింది. ఇండియన్ రీటైల్ మార్కెట్ లో ఒక్కరోజులోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను ఫ్లిప్ కార్ట్ చేపట్టింది. దసరా పండగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డే’ సేల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 

ఈనెల 10 నుంచి ఈ ఆఫర్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌ తొలి రోజు పలు కంపెనీల స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తొలి గంటలో సుమారు 10 లక్షల ఫోన్ల అమ్మకాలు జరగ్గా.. ఒక్కరోజులో 30లక్షల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయినట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్మృతి రవిచంద్రన్‌ తెలిపారు.

భారత రిటైల్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక్కరోజులోనే అత్యధిక స్మార్ట్‌ఫోన్లు అమ్మినట్లు ఆమె వెల్లడించారు. రియల్‌మి, షామీ, శాంసంగ్‌, నోకియా, ఆసుస్‌, ఇన్ఫినిక్స్‌, హానర్‌ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఫ్లిప్‌కార్ట్‌ 10-14 తేదీ వరకు బిగ్‌ బిలియన్‌ డే పేరిట ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ అత్యధికంగా డిస్కౌంట్‌ను, క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. 

పండగ సేల్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ 30వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. సరఫరా, రవాణా కార్యకలాపాల కోసం వీరిని నియమించుకుంది. మరో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ఐదు రోజుల పాటు ‘అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ పేరుతో విక్రయాలు నిర్వహిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios