నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారా.. అయితే ఇప్పుడు మీరు వాటిని షేర్ చేయలేరు..
వాషింగ్టన్ జర్నల్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ వచ్చే ఏడాది కస్టమర్లకు పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకునే ఫెసిలీటి ఉపసంహరించుకోబోతోంది. అయితే ఈ కొత్త రూల్ ఆకస్మికంగా అమలు చేయకుండా, కంపెనీ క్రమంగా లేదా దశలవారీగా అమలు చేయవచ్చని చెబుతున్నారు.
మీరు వెబ్ సిరీస్‌లు ఇంకా సినిమాలు చూడటానికి ఓటిటి ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగిస్తున్నారా.. అయితే మీకో చెదు వార్తా. మీరు ఇప్పుడు ఒకేసారి ఒక డైవైజ్ లో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ అక్కౌంట్ కి లాగిన్ చేయవచ్చు. చాలా మంది యూజర్లు ఇండియాలో ఫ్రెండ్స్ లేదా తెలిసిన వారి నెట్‌ఫ్లిక్స్ అక్కౌంట్ వివరాలు తీసుకొని వాడుతుంటారు, ఈ కారణంగా కంపెనీ ఆదాయంపై ప్రభావం పడుతుంది. దీంతో ఇప్పుడు కంపెనీ లాగిన్ పాస్‌వర్డ్ షేరింగ్ సౌకర్యాన్ని నిలిపివేయబోతోంది.
వాషింగ్టన్ జర్నల్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ వచ్చే ఏడాది కస్టమర్లకు పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకునే ఫెసిలీటి ఉపసంహరించుకోబోతోంది. అయితే ఈ కొత్త రూల్ ఆకస్మికంగా అమలు చేయకుండా, కంపెనీ క్రమంగా లేదా దశలవారీగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. పాస్‌వర్డ్ షేరింగ్‌ను తొలగించడం కస్టమర్లకు నచ్చనప్పటికీ, దాని వల్ల కంపెనీకి చాలా నష్టం వాటిల్లుతుందని, ఇంకా ఎదురుదెబ్బ పడవచ్చని కంపెనీ చెబుతోంది.
కొత్త సంవత్సరంలో ఈ రూల్
వచ్చే ఏడాది అంటే 2023 నుంచి కొత్త రూల్‌ని అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంటే, ఇప్పుడు కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగించడానికి పాస్‌వర్డ్ షేరింగ్ ఎకోసిస్టమ్ నుండి ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. అయినప్పటికీ, పేమెంట్ సబ్ స్క్రిప్షన్ దాటవేయడానికి వినియోగదారులకు ఇప్పటికీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ మంత్లీ ప్లాన్ ధర
భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ ప్రతినెల ప్లాన్‌ల గురించి మాట్లాడితే అతితక్కువ ధరకే మొబైల్ ప్లాన్ వస్తుంది, దీని ధర నెలకు రూ. 149. అయితే, బేసిక్ ప్లాన్‌కు నెలకు రూ.199 ఖర్చవుతుంది. Netflix స్టాండర్డ్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 499, ప్రీమియం ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ. 649. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అడ్వర్టైజ్‌మెంట్ ప్లాన్‌ను కూడా ప్రారంభించింది, ఈ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించినట్లయితే దాని ధర రూ. 99 అవుతుంది.