సోషల్ మీడియా వేదికలపై వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలను అరికట్టేందుకు మిచిగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నావెల్ టూల్ కనుగొన్నారు. ఇప్పీ క్యూటైంట్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ టూల్.. మీడియా బయాస్, ఫ్యాక్ చెక్ అనే టూల్స్ ద్వారా వాస్తవాలను నిగ్గు తేలుస్తుంది.
సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికల్లో ఇటీవలి కాలంలో నకిలీ వార్తలు, వదంతులు, పుకార్లు ప్రజలను మాయ చేస్తున్నాయి. పలు ప్రభుత్వాలు అతలాకుతలం అయ్యాయి కూడా. ఇటు సోషల్ మీడియా వేదికలు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కానీ ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వేదికల్లో నకిలీ వార్తలను నియంత్రించేందుకు హెల్ప్ చేసేందుకు శాస్త్రవేత్తలు వెబ్ బేస్డ్ టూల్‌ను డెవలప్ చేశారు. అమెరికాలోని మిషిగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆ టూల్‌ను డెవలప్ చేశారు. టూల్ యూజర్లు ‘హెల్త్ మెట్రిక్’ ఇఫ్పీ క్యూటైంట్ పేరుతో దీన్ని వాడొచ్చు.
ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికలపై రోజువారీగా వచ్చే సమాచారాన్ని సేకరిస్తుంది. మీడియా బయాస్ లేదా ఫాక్ట్ చెకర్‌గా న్యూస్ విప్ ఉంటుంది. రోజూ అత్యధికంగా ప్రజాదరణ పొందిన 5000 యూఆర్ఎల్స్‌లో నిజానిజాలను వెలికి తీయాలని ఇఫ్పీ క్యూటైంట్‌ను కోరుతుంది. ఈ టూల్ మీడియా బయాస్, ఫాక్ట్ చెక్ లిస్ట్ ఆధారంగా సదరు యూఆర్ఎల్స్‌ను మూడు క్యాటగిరీల్లోకి విభజిస్తోంది.
సదరు పోస్టుల్లో ఉన్న సమాచారం సరైందా? వామపక్ష భావజాలం కలిగి ఉందా? మితవాద భావజాలంతో కూడిందా? లేదా వ్యంగ్యంతో కూడుకున్నదా?, నిర్దేశిత అంశాల పరిధిలోకి వస్తుందా? లేదా? అన్న అంశాన్ని కూడా ఇఫ్పీ క్యూటైంట్ నిర్ధారిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్‌ల్లో తొలిసారి 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యయనవేత్తలు దీన్ని పరీక్షించారు. ట్విట్టర్ కంటే ఫేస్ బుక్‌లో 50 శాతం సమాచారాన్ని ఇఫ్పీ తనిఖీ చేస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 29, 2018, 12:55 PM IST