Asianet News TeluguAsianet News Telugu

6న అమెరికాలో మోటో 'రేజర్' ఫోన్ ఆవిష్కరణ.. భారత్‌లో రిలీజ్‌పై అనిశ్చితి

‘మోటో రేజర్’ప్రీ-ఆర్డర్లు ఆదివారం నుంచి అమెరికాలో ప్రారంభం కానున్నాయి. భారత్​లో ఈ ఫోన్ విడుదల తేదీపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు

Motorola Razr is coming. Here's what to expect from the first foldable flip phone
Author
Hyderabad, First Published Jan 26, 2020, 1:48 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ మోటరోలా సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో రేజర్’ ను వచ్చేనెల ఆరో తేదీన మార్కెట్లో విక్రయాలకు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. దీని ధరను 1,499 డాలర్లగా సంస్థ నిర్ణయించింది. 

ప్రీ-ఆర్డర్లు ఆదివారం నుంచి అమెరికాలో ప్రారంభం కానున్నాయి. భారత్​లో ఈ ఫోన్ విడుదల తేదీపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. ఈ సరికొత్త మొబైల్​ను కొనాలనుకునే వారు వెరిజోన్, వాల్‌మార్ట్, మోటొరోలా.కామ్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ మడత సదుపాయం కలిగిన రెండు డిస్​ప్లేలు కలిగి ఉంటుంది. 
6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది. ఫోన్‌ ఓపెన్ చేసినప్పుడు లోపల 6.2 అంగుళాల అమోలెడ్ డిస్​ప్లే, మడత పెట్టినప్పుడు బయటవైపు 2.7 అంగుళాల అమోలెడ్ డిస్​ప్లే ఉంటుంది. 

ఫోన్​ బయటవైపు ఉన్న క్విక్​ వ్యూ డిస్​ప్లే కెమెరాగా పని చేస్తుంది. క్విక్​ వ్యూ డిస్​ప్లేలో 16 ఎంపీల కెమెరా కలిగి ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఇది వెనుకవైపు కెమెరాగా మారుతుంది. ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు లోపల మరో 5 ఎంపీ కెమెరా కూడా ఉంటుంది. అదనంగా స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్‌
అమర్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios