Asianet News TeluguAsianet News Telugu

27 నుంచి పంచ్‌హోల్‌ కెమెరా ‘మోటోవన్‌ విజన్‌’ ఫోన్ లభ్యం


లెనొవో అనుబంధ మోటోరోలా సంస్థ మార్కెట్లోకి ‘మోటో వన్ విజన్’ పేరిట నూతన స్మార్ట్ ఫోన్‍ను ఆవిష్కరించింది. ఇది శామ్ సంగ్ గెలాక్సీ ఎం 40, షియోమీ ఫొకో ఎఫ్ 1 వంటి ఫోన్లకు పోటీ ఇవ్వనున్నది. 
 

Motorola launches One Vision with 48MP camera at Rs 19,999
Author
New Delhi, First Published Jun 22, 2019, 11:09 AM IST

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. శాంసంగ్‌, నోకియా, మోటోరోలా వంటి సంస్థలకు చైనా మొబైల్‌ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ ఏర్పడింది. దీన్ని తట్టుకుని నిలబడేందుకు శామ్‌సంగ్ గెలాక్సీ ఎం, గెలాక్సీ ఏ సిరీస్‌ల్లో బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తోంది.

తాజాగా మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత విపణిలోకి విడుదల చేసింది. ‘మోటోరోలా వన్‌ విజన్‌’ పేరుతో తీసుకొచ్చిన దీని ధర రూ.19,999. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం40, షియోమీ పోకో ఎఫ్‌1 తదితర రూ.20,000లోపు ధరలు కలిగిన ఫోన్లకు ఇది పోటీ ఇవ్వనుంది. 

ఈ నెల 27వ తేదీ నుంచి ఇది ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యంకానుంది. ప్రారంభ ఆఫర్‌ కింద మొదటి వారం (జూన్‌ 27 నుంచి జులై 4) అన్ని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఆర్నెల్ల పాటు వడ్డీ రహిత వాయిదాల్లో కొనుగోలు చేసుకోవచ్చు. వోడాఫోన్‌ వినియోగదారులు రూ.3,750 క్యాష్‌బ్యాక్‌తో పాటు, అదనంగా 250జీబీ డేటాను పొందవచ్చు. 

కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌‌తోపాటు 6.3ఫుల్‌హెడ్‌ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. శామ్‌సంగ్‌ ఎగ్జినోస్‌ 9609 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌ విత్ 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం కలిగి ఉండగా, మైక్రో ఎస్డీకార్డు సహాయంతో 512జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సామర్థ్యం దీని సొంతం. బ్యాకప్  48+5 మెగా పిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా సెటప్‌, ఫ్రంట్ వైపు 25 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతోపాటు 15వాట్ల టర్బో చార్జింగ్ సామర్థ్యం గల 3500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. 

స్మార్ట్ కంపోజిషన్, ఆటో స్మైల్ కాప్చర్, పొర్టయిట్ లైటింగ్, షాట్ ఆప్టిమైజేసన్, గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ వంటి కృత్రిమ మేధస్సు ఫీచర్లు మోటోరోలా వన్ విజన్ ఫోన్‌లో లభిస్తాయి. తాము సాఫ్ట్ వేర్ అవసరాల కోసం గూగుల్‌తో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని మోటోరోలా తెలిపింది. ఆండ్రాయిడ్ వన్ ద్వారా అప్ టూ డేట్ ఓఎస్ తోపాటు మూడు నెలల సెక్యూరిటీ అప్ డేట్స్‌పై గూగుల్‌తో భాగస్వామ్యం కొనసాగుతుందన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios