ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లు మరోసారి భారీ ఆఫర్లకు తెరలేపాయి. కొద్దిరోజుల క్రితమే దసరా పండగను పురస్కరించుకొని భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అవి అలా ముగిశాయో లేదో.. ఇప్పుడు దీపావళి ధమాకా అందించడానికి రెడీ అయ్యాయి. 

ఫ్లిప్‌కార్ట్‌లో ‘ఫెస్టివ్ ధమాకా డేస్’ పేరుతో దీపావళికి పండుగ అమ్మకాలు జరపనున్నారు. ఈ నెల 24 నుంచి 27వరకూ ఈ సేల్ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్స్, సంబంధిత ఉత్పత్తులపై 80శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
 
టీవీలపై 70శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 40 నుంచి 80శాతం వరకూ ధరలపై తగ్గింపును ప్రకటించింది. ఇక మరో ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరుతో పండుగ సేల్స్‌కు భారీగా సన్నాహాలు చేస్తోంది. పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా అక్టోబర్ 24 నుంచి 28వరకూ వినియోగదారులకు ఆఫర్ అందుబాటులో ఉండనుంది. పేటీఎం కూడా ‘మహా క్యాష్‌బ్యాక్’ పేరుతో 22 నుంచి 25వరకూ భారీగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చని పేర్కొంది. ఏదేమైనా దసరాకు ఆఫర్లలో కొనలేకపోయామని బాధపడేవారికి ఈ దీపావళి సేల్స్ ఉపయోగపడే అవకాశముంది.