భారతీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ (Micromax) మరో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 (Micromax In Note 2) ఫోన్ మంగ‌ళ‌వారం (జనవరి 25న) విడుదల కానుంది. 

భారతీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ (Micromax) మరో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 (Micromax In Note 2) ఫోన్ మంగ‌ళ‌వారం (జనవరి 25న) విడుదల కానుంది. అమోలెడ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు మంచి స్పెసిఫికేషన్లతో బడ్జెట్ రేంజ్‌లోనే ఈ మేడిన్ ఇండియా (Made in India) మొబైల్ రానుంది. ఇన్ నోట్ 2కు సంబంధించిన టీజర్లను ఇప్పటికే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది మైక్రోమ్యాక్స్. Micromax In Note 2 అమ్మకాలు ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో జరగనున్నాయి.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్పెసిఫికేషన్లు


6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో Micromax In Note 2 రానుంది. 21:9 యాస్పెక్ట్‌ రేషియో, 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం మధ్యలో పంచ్ హోల్ ఉంది. అలాగే వెనుక ప్యానెల్ గ్లాస్ ఫినిష్‌తో డిజైన్ పరంగానూ ఈ ఫోన్ ఆకర్షణీయంగా ఉండనుంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ ఈ మొబైల్‌లో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి వస్తుంది. అలాగే మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది.

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్ 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, టైప్‌-సీ పోర్ట్ ఉన్నాయి. 25 నిమిషాల్లోనే 50శాతం చార్జ్ అవుతుందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది. కాగా, లాక్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. Micromax In Note 2 మొబైల్ వెనుక నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. సామ్‌సంగ్ ఎస్21 కెమెరా మాడ్యూల్‌ను ఇది పోలి ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. గత సంవత్సరం విడుదలైన మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ విడుదల కాగా.. దానికి సక్సెసర్‌గా ఇన్ నోట్ 2 వస్తోంది.