ముంబై: అమెజాన్‌ ఇండియాలో షియోమి, ఎంఐ 4 సిరీస్‌ టీవీలు స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. షియోమి  రెడ్‌ మీ 6ఏ,  రెడ్‌మీ 6 ప్రీ, రెడ్‌మీ వై2, రెడ్‌మీ 6, రెడ్‌మీ 7  తదితర స్మార్ట్‌ఫోన్లతోపాటు ఎంఐ టీవీ ధరపై రూ.7000 వరకు రాయితీపై పొందొచ్చు.  

ముఖ్యంగా రూ. 10వేల నుంచి రూ. 15 వేల మధ్య లభించనున్న స్మార్ట్‌ఫోన్లపై  డిస్కౌంట్‌ ఆఫర్‌ లభిస్తుంది. అలాగే అమెజాన్‌ క్యాష్‌బ్యాక్‌, ఎక్స్చేంజ్,  తాత్కాలిక తగ్గింపులాంటి పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది.

ఎంఐ టీవీ 4 సిరీస్ టీవీలపై ఎక్స్చేంజ్, ఆఫర్‌ అందిస్తోంది. 49, 55, 43 అంగుళాల,  ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ, ఎల్‌ఈడీ 4ఏ టీవీపై రూ.2260  దాకా ఎక్స్చేంజ్ ఆఫర్‌ ఉంది. ఒక్కసారి ఆ ఆఫర్లను పరిశీలిద్దాం..

షియోమీ రెడ్ మీ 7: 2జీబీ, 3జీబీ వేరియంట్లలో లభించే షియోమీ రెడ్ మీ 7 మోడల్ ధర రూ.7,999, రూ.8,999. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే ఐదు శాతం రాయితీ.

షియోమీ రెడ్ మీ వై3: రెడ్ మీ వై3 మోడల్ ఫోన్ ధర రూ.9999 నుంచి ప్రారంభం అవుతుంది. 3జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ఫోన్ ధర రూ.11,999. 

షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో: షియోమీ స్మార్ట్ ఫోన్లలోనే ప్రజాదరణ పొందిన మోడల్ ఇది. దీని ధర రూ.10,999 నుంచి మొదలైంది. 4జీబీ రామ్ విత్64 జీబీ రామ్ స్టోరేజీ దీని సామర్థ్యం. ఇది బ్లాక్ అండ్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. 

షియోమీ రెడ్ మీ 6ఎ: దీని ధర రూ.5,999 నుంచి మొదలవుతుంది. 2జీబీ మోడల్ ఫోన్ రూ.5999, 3జీబీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.6,499. 

షియోమీ రెడ్ మీ వై2ఐ: సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఇది. దీని లాంచింగ్ ధర రూ.8,999 నుంచి మొదలవుతంది. 3 జీబీ విత్ 32 జీబీ రామ్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.8,999 అయితే, 4జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.9999. 

షియోమీ ఎంఐ ఎ2ఐ: ఈ ఫోన్ ధర రూ.11,999 నుంచి మొదలవుతుంది. దీనిపై కొనుగోలు దారులు రూ.2000 డిస్కౌంట్ పొందుచ్చు. 

మీ స్పోర్ట్స్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్: ఇది రూ.1,499లకే లభ్యం. దీని అసలు ధర రూ.1,799. 9 గంటల సామర్థ్యం గల బ్యాటరీ, ఐపీఎక్స్ 4 రేటెడ్ ఇయర్ ఫోన్ ఇది.