ముంబై: స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. డిస్కౌంట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి  ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ ప్రకటించింది. ఈ సేల్‌ ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 21వ తేదీన ఈ ఆఫర్ ముగియనుంది.

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్‌,  దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్శామ్‌సంగ్‌, చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వివో, రియల్‌మీ  బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో ఫ్లిప్ కార్ట్ అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్,  బడ్జెట్ ఇలా స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను  ప్రకటించింది.

అలాగే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులతో చేసిన అన్ని లావాదేవీలపై 10 శాతం ధరల తగ్గింపు దీనికి అదనం కానుంది. 
రూ.15 వేల కేటగిరిలో శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ50, వివో జెడ్‌1 ప్రొ ఫోన్లు రూ.12,999 నుంచి రూ.11,990ధరలలో లభిస్తాయి. 
వివో జెడ్‌1. రియల్‌మి ఎక్స్‌టీ రూ.13,990, రూ,14,999 వద్ద తగ్గింపు ధరలలో లభ్యం కానున్నాయి. దాదాపు అన్ని రకాల మొబైల్స్‌ తగ్గింపు ధరలలో ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

వివో జెడ్ 1 ఎక్స్, రియల్‌ మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్లు రూ. 13,990, రూ.14,999 నుండి లభిస్తాయి. నోకియా లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ 7.2  ధరను తగ్గించి రూ .15,499కే లభిస్తుంది. 

ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్‌ రూ.రూ .26,990కు లభిస్తుంది.  దీని అసలు ధర రూ. 40వేల నుంచి భారీ తగ్గింపునిస్తూ ఫ్లిప్ కార్డ్ నిర్ణయం తీసుకున్నది. 

ఫ్లాగ్‌షిప్ కిల్లర్ రియల్‌మీ ఎక్స్ 2 ప్రో రూ .27,999కు లభిస్తుంది. దీనిపై ధర తగ్గింపు రూ. 2000గా నిర్ణయించారు. బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రూ .29,999లకు, పిక్సెల్ 3 ఎ సిరీస్ రూ.27,999 కంటే తక్కువకు లభించనుంది. అలాగే శామ్‌సంగ్‌  గెలాక్సీ ఎస్ 9 సిరీస్ కూడా రూ .22,999 నుండి లభిస్తుంది.

ఆండ్రాయిడ్‌ నుంచి ఐవోస్‌కు మారాలనుకుంటున్న వారికి కూడా ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్తనందించింది. ఐఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్‌ఎస్ ధర రూ.54,999 నుండి ప్రారంభం అవుతుంది. ఐఫోన్ 8 ఫోన్‌ను రూ .35,999 కు పొందవచ్చు. 

ఇదిలా ఉంటే ఫ్లిప్‌‌కార్ట్ తన కస్టమర్లకు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం లోకల్ స్టోర్లతో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకుంటోంది. కొన్ని ప్రొడక్ట్‌‌లకు కస్టమర్లు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను కోరుకుంటున్నారని ఫ్లిప్‌‌కార్ట్ పేర్కొంది.

రిలయన్స్ లోకల్ కిరాణా స్టోర్లతో కలిసి గ్రోసరీలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తోన్న క్రమంలో ఫ్లిప్‌‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నది. వాల్‌‌మార్ట్‌‌ అనుబంధ ఫ్లిప్‌‌కార్ట్ లోకల్ కిరాణా స్టోర్లతో కలిసి డెలివరీ మోడల్‌‌ను ఏర్పాటు చేసింది. 700 నగరాల్లో 27000 స్టోర్లతో టైఅప్ అయింది. దీని కోసం స్టోర్లలో అధికారిక ‘బై జోన్స్’ ఏర్పాటు చేస్తోంది. 

కస్టమర్లు స్టోర్లకు వెళ్లి ప్రొడక్ట్‌‌ను చెక్ చేసుకుని, దాన్ని ఆన్‌‌లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ అధికారులు చెప్పారు. ‘హైదరాబాద్‌‌లో మా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. లోకల్ స్టోర్లతో కలిసి మొబైల్స్‌‌కు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్ అందించాం. ఆర్డర్‌‌‌‌ ఆన్‌‌లైన్‌‌లో స్వీకరించాం’ అని ఫ్లిప్‌‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజ్‌‌నీష్ కుమార్ చెప్పారు. 

దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా లోకలైజ్డ్ పార్టనర్‌‌‌‌షిప్‌‌లను పెంచుకుంటున్నామని ఫ్లిప్‌‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజ్‌‌నీష్ కుమార్ తెలిపారు. దేశంలో మొత్తం రిటైల్ మార్కెట్‌‌లో ఆన్‌‌లైన్ మార్కెట్ కేవలం 3 శాతమే ఉందని కుమార్ చెప్పారు. ఫ్యాషన్‌‌ రంగంలో లోకల్ రిటైలర్లతో టైఅప్స్‌‌, ఈ–కామర్స్ కంపెనీకి మంచి ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు.