Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ దాటేసిన ఎల్&టీ: మైండ్ ట్రీలో 60% దాటిన ఇన్ ఫ్రా మేజర్ షేర్

దేశీయ ఐటీ రంగంలో హోలిస్టిక్ టేకోవర్ దాదాపు పూర్తి కావచ్చింది. మైండ్ ట్రీ సంస్థలో ఓపెన్ ఆఫర్ ద్వారా 31 శాతం షేర్ల కొనుగోలుకు ఎల్ అండ్ టీకి బిడ్డు వచ్చాయి. అంతకుముందు వీజీ సిద్ధార్థ నుంచి 20.36 శాతం.. బహిరంగ మార్కెట్ ద్వారా మిగతా వాటాల కొనుగోలు చేసింది. 

L&T gets over 60% holding in Mindtree; open offer over-subscribed
Author
New Delhi, First Published Jun 28, 2019, 11:52 AM IST

న్యూఢిల్లీ: ఇన్ ఫ్రా మేజర్ ‘ఎల్ అండ్ టీ’ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నది. మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’లో మెజారిటీ వాటా చేజిక్కించుకున్నది. ఇందుకోసం ప్రకటించిన ఓపెన్ ఆఫర్ ద్వారా అంచనాలకు మించి 31 శాతానికి పైగా షేర్లను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసిందని స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన సమాచారం చెబుతోంది. 

 

ప్రారంభంలో ఎల్ అండ్ టీ టేకోవర్ యత్నాలను గట్టిగా ప్రతిఘటించిన మైండ్ ట్రీ యాజమాన్యం క్రమంగా మెత్తబడింది. ఇప్పటికే సీనియర్ ఎగ్జిక్యూటివ్ రిటైరయ్యేందుకు సిద్ధం అయ్యారు. సీఈఓ రొస్తోవ్ రావణన్ రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. 

 

తొలుత గత మార్చిలో రూ. 3000 కోట్ల వ్యయంతో కాఫీ డే సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ నుంచి మైండ్ ట్రీకి చెందిన 20.32 శాతం షేర్లను కొనుగోలు చేయడం ద్వారా లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ) తన లక్ష్య చేదన ప్రారంభించింది. 

 

తాజాగా ఓపెన్ ఆఫర్ ద్వారా 31 శాతం వాటాను కొనుగోలు చేసింది ఎల్ అండ్ టీ. గురువారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి 5.54 కోట్ల షేర్లకు బిడ్లు ఎల్ అండ్ టీకి చేరాయి. ఇది ఎల్ అండ్ టీ అంచనా ఆఫర్ కంటే 108.09 శాతం ఎక్కువ. ఓపెన్ ఆఫర్ ద్వారా ఒక్కో షేర్ పై ఎల్ అండ్ టీ రూ.980 చెల్లిస్తోంది. 

 

మైండ్ ట్రీ సంస్థ టేకోవర్ కోసం ఎల్ అండ్ టీ సంస్థ ఈ నెల 17వ తేదీన ప్రారంభించిన ఓపెన్ ఆఫర్ శుక్రవారం ముగుస్తుంది. అంటే ఒక రోజు ముందే ఎల్ అండ్ టీ నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా ఓపెన్ ఆఫర్ల ద్వారా బిడ్డు సేకరించింది. ప్రారంభంలో ఎల్ అండ్ టీ యత్నాలకు అడ్డు పడ్డ మైండ్ ట్రీ వ్యవస్థాపకులు తర్వాత మద్దతు పలికారు. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న నలంద క్యాపిటల్ తదితర వాటా దారులు తమ వాటాలను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించేశారు. 


 ఇక మైండ్ ట్రీ వ్యవస్థాపకులు సుబ్రతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి, క్రుష్ణ కుమార్ నటరాజన్, వారి కుటుంబాలకు కలిపి సుమారు 13 శాతం వాటా ఉంది. మరోవైపు ఇప్పటికే ఎల్ అండ్ టీ ముగ్గురు డైరెక్టర్లు చేరేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా సుబ్రతో బాగ్చి తన డైరెక్టర్ పదవి త్వరలోనే ముగియనున్నది. దానిపై రీ క్లెయిమ్‍కు బాగ్చి సిద్ధంగా లేరు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios