Asianet News TeluguAsianet News Telugu

ఐఫోన్ యూజర్ల కోసం జియో గుడ్ న్యూస్.. 5జి సర్వీస్ తో ఆన్ లిమిటెడ్ హై స్పీడ్ డేటా..

రిలయన్స్ జియో  ప్రకటనలో ఐఫోన్ 12 ఇంకా ఆపై మోడల్స్ ఐఫోన్ వినియోగదారులందరూ జియో వెల్ కం ఆఫర్‌లకు అర్హులు. అంటే, వారు ట్రులీ ఆన్ లిమిటెడ్ 5G డేటాకు ఉచితంగా యాక్సెస్ పొందుతారు. 

Jio launches 5G services  with unlimited data for iPhone 12 and above
Author
First Published Dec 15, 2022, 6:32 PM IST

అమెరికన్ టెక్ కంపెనీ ఆపిల్ కొత్త ఐ‌ఓ‌ఎస్ 16.2 వెర్షన్‌తో పాటు ఈరోజు దేశీయ టెలికాం రిలయన్స్ జియో ఐఫోన్‌ల కోసం జియో ట్రు 5జి సేవను పరిచయం చేసింది. ఐఫోన్ 12 ఇంకా అంతకంటే పై ఉన్న ఐఫోన్ వినియోగదారులందరూ జియో ట్రూ 5 జితో ఆన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఆపిల్ iOS 16.2 వెర్షన్‌తో భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులు 5G బీటా వెర్షన్‌కు యాక్సెస్ పొందారని తెలిపింది. కొన్ని రోజుల తర్వాత స్టేబుల్ వెర్షన్ అందుబాటులోకి రావచ్చు. 

రిలయన్స్ జియో  ప్రకటనలో ఐఫోన్ 12 ఇంకా ఆపై మోడల్స్ ఐఫోన్ వినియోగదారులందరూ జియో వెల్ కం ఆఫర్‌లకు అర్హులు. అంటే, వారు ట్రులీ ఆన్ లిమిటెడ్ 5G డేటాకు ఉచితంగా యాక్సెస్ పొందుతారు. ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులు Jio వెల్‌కమ్ ఆఫర్‌ల క్రింద గరిష్టంగా 1GBPS స్పీడ్,  ఆన్ లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించవచ్చు. సర్వీస్-ఆన్-ఇన్విటేషన్ దశలో Jio ప్రస్తుతం 5G సేవను ప్రవేశపెట్టింది, ఈ సేవను ఉపయోగించడానికి ఇప్పటికే ఉన్న Jio వినియోగదారుల నుండి సెలెక్ట్ చేసిన వినియోగదారులకు ఇన్విటేషన్ పంపబడతాయి.

ఆపిల్ లేటెస్ట్  అప్ డేట్ 
టెక్ దిగ్గజం ఆపిల్ భారతీయ వినియోగదారుల కోసం డిసెంబర్ 13 రాత్రి 11:30 గంటల నుండి 5G నెట్‌వర్క్ సపోర్టును విడుదల చేసింది. భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులు  కవరేజ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. 2020లో లేదా ఆ తర్వాత లాంచ్ చేసిన అన్ని iPhoneలలో 5Gని ఉపయోగించవచ్చు. 

ఈ  ఐఫోన్స్ లో జియో ట్రు 5జి 
జియో ట్రు 5జిని ఆపిల్ ఐఫోన్ 12 ఇంకా అన్ని అప్ డేట్ వేరియంట్‌లలో ఉపయోగించవచ్చు. ఈ మోడల్‌లలో ఐఫోన్ SE (2022), ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్స్, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14  ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios