Asianet News TeluguAsianet News Telugu

రూ.2,500కే జియో గిగా ఫైబర్‌ కనెక్షన్‌!

టెలికం రంగ సంచలనం ‘రిలయన్స్‌ జియో’ మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్‌ పేరిట త్వరలో రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

Jio GigaFiber Said to Lower Entry-Cost With New Security Deposit of Rs. 2,500
Author
Hyderabad, First Published Jun 8, 2019, 9:37 AM IST

టెలికం రంగ సంచలనం ‘రిలయన్స్‌ జియో’ మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్‌ పేరిట త్వరలో రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవల గురించి అప్పుడే పలు రకాల వార్తలు షికారు చేస్తున్నారు. 

ప్రాథమికంగా బ్రాడ్ బాండ్ సేవలు రూ.600కే ఈ సేవలు యూజర్లకు అందుబాటులోకి వస్తాయని వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఈ కనెక్షన్‌ తీసుకున్న వారికి ప్రివ్యూ ఆఫర్‌ కింద ఉచితంగానే సేవలు అందిస్తున్నారు. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.4,500 చెల్లించాల్సి ఉంటుంది. 

యూజర్లను ఆకట్టుకునేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించే మొత్తాన్ని జియో తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. గతానికంటే రూ.2వేలు తక్కువగా అంటే రూ.2,500కే కనెక్షన్‌ అందిస్తున్నట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌లో కనెక్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

రూ.2500 కనెక్షన్‌తో సింగిల్‌ బ్యాండ్‌ రూటర్‌ మాత్రమే అందిస్తారు. అదే రూ.4,500 పెట్టి కొనుగోలు చేసే కనెక్షన్‌లో డ్యూయల్‌ బ్యాండ్‌ రూటర్‌తో అందిస్తున్నారు. ఇది 2.4GHz, 5GHz బ్యాండ్‌ విడ్త్ మద్దతు అందజేస్తోంది. 

రిలయన్స్ జియో గిగా ఫైబర్ బ్రాడ్ బాండ్ సేవలను యూజర్లకు ఇచ్చే రూ.4,500 కనెక్షన్‌తో పోలిస్తే ఈ కొత్త కనెక్షన్‌లో వేగం తక్కువ. రూ.4,500 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌ వేగం అందిస్తుంటే.. కొత్త కనెక్షన్‌ కింద 50 ఎంబీపీఎస్‌ వేగం ఉంటుంది. ఈ చౌక ప్లాన్‌లో వాయిస్‌ సేవలు కూడా అందుతాయి. దీనిద్వారా ఇతరులకు కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. 

దీంతోపాటు రిలయన్స్ జియో గిగా ఫైబర్ బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ టీవీ యాప్‌ను కూడా అందిస్తోంది. అయితే, కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌కు సంబంధించి జియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడక పోవడం గమనార్హం. కానీ, కొందరు యూజర్లు మీడియాలో వస్తున్న కథనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

తక్కువ సెక్యూరిటీ డిపాజిట్‌ ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం జియో తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గిగా ఫైబర్ బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్ పరిధిలో జియో వాణిజ్య సేవలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios