నాలుగో తరం నుంచి ఐదో తరం వాయు తరంగాల్లోకి అడుగిడబోతున్నది టెలికం రంగం. అయితే 5జీ రంగం విస్తరించాలంటే ముందు ఫైబర్ మౌలిక వసతులను విస్తరించాల్సిన అవసరం ఉన్నదని ట్రాయ్ చైర్మన్ఆర్ఎస్ శర్మ చెప్పారు. కానీ ఈ ఫీట్ ను చైనా ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయడం కష్ట సాధ్యంగా మారనున్నది.
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ‘5జీ’ సేవలను విస్తరించడంలో భారత్ ముందు ఉండే అవకాశం ఉన్నదని టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. అయితే ఫైబర్ నెట్‌వర్క్‌పై పెట్టుబడులు పెంచడంపైనే అది ఆధారపడి ఉంటుందన్నారు.
మౌలిక వసతుల్లో చైనా కంటే వెనుకేనన్న ట్రాయ్
ప్రస్తుతం చైనా వంటి దేశాలతో పోలిస్తే మౌలిక వసతుల కల్పనలో భారత్ వెనుకబడి ఉన్నదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆయన గుర్తు చేశారు. ‘5జీ విషయంలో అన్ని అడ్డంకులను అధిగమించి మనం చాలా వేగంగా ముందుకు వెళ్లవచ్చు. సమాచారం, కమ్యూనికేషన్ల సాంకేతికతల ద్వారా ఆ అడ్డంకులను తొలగించుకోవచ్చు. ఫైబర్ నెట్‌వర్క్‌పై భారీ పెట్టుబడులు పెట్టకుండా 5జీ కావాలంటే కుదరదు’ అని ట్రాయ్ చైర్మన్ శర్మ అన్నారు.
ఏడాదిలోనే చైనాలో మౌలిక వసతుల కల్పన‘ఇప్పటిదాకా భారత్‌లో ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్‌వర్క్‌ను చైనా కేవలం ఒక ఏడాదిలోనే ఏర్పాటు చేసింది. కాబట్టి మౌలిక వసతుల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తగిన విధానాలను తేవాల్సి ఉంటుంది. ద నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్‌డీసీపీ)లో ఆ తరహా విధానాలు, ప్రకటనలు ఉన్నాయి. ఇపుడు వాటిని అమలు చేసి పెట్టుబడులు రాబట్టుకోవాలి’అని ట్రాయ్ చైర్మన్ శర్మ అన్నారు.
ఇంటర్ లింకింగ్ సమస్య పరిష్కరించుకోవాలి
కాగా, భారత్‌లో టెలికం రంగంలో అత్యవసరంగా అనుసంధాన సమస్యలను పరిష్కరించాల్సి ఉందని కూడా ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మీ తెలిపారు. ఇతర టెలికాం మార్కెట్ల తరహాలో ఇక్కడి మూడు ప్రైవేట్ కంపెనీలు, ఒక ప్రభుత్వ రంగ కంపెనీ కలిసి పనిచేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జొమాటోతో ‘పేటీఎం’ జత
ఇక ఆహార ప్రేమికులు పేటీఎం యాప్ ద్వారా ఆహార పదార్థాలు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందుకోసం పేటీఎం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో చేతులు కలిపినట్లు పేటీఎం మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ గురువారం తెలిపింది. జొమాటో సహకారంతో పేటీఎం యాప్ ద్వారా ఆహార పదార్థాలు ఆర్డర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆండ్రాయిడ్ డివైజెస్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో భారతదేశ వ్యాప్తంగా తమ సేవలు ప్రారంభిస్తామని పేటీఎం పేర్కొంది. అలాగే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని యాప్‌లకు కూడా ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపింది.
నెలాఖరులోగా 100 నగరాల్లోని 80 వేల రెస్టారెంట్ల కవరేజీ లక్ష్యం: పేటీఎం
ఈ నెలాఖరు వరకు వంద నగరాల్లోని 80వేల రెస్టారెంట్లను కవర్ చేస్తూ ఫుడ్ ఆర్డర్ సర్వీసును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేటీఎం తెలిపింది. పేటీఎంకు ఇప్పటికే ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాల పరిధిలో చాలా మంది వినియోగదారులు ఉన్నారు. ప్రారంభ ఆఫర్‌గా పేటీఎం యాప్ నుంచి ఆర్డర్లపై రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నది. జొమాటో గత ఏడాది నవంబర్ నాటికి దాని సేవలను మరో 30 నగరాలకు విస్తరించింది. ఇప్పుడు వంద నగరాల్లో 80వేల రెస్టారెంట్లు దీని పరిధిలో ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న ఆర్బీఐ
బిట్‌కాయిన్లు, వర్చువల్ కరెన్సీల నిర్వహణ అత్యంత ప్రమాదకరమని ఆర్బీఐ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. అంటువ్యాధి వంటి ఎటువంటి డిజిటల్ కరెన్సీ వ్యవస్థలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను అందజేయవద్దని బ్యాంకులను ఆదేశించినట్లు కూడా చెప్పారు. వర్చువల్ కరెన్సీల సేవలపై నిషేధం అమలుకు వ్యతిరేకంగాఆర్బీఐకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కలిపి జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలను ఫిబ్రవరి 26న కోర్టు విననున్నది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 18, 2019, 11:38 AM IST