ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా.. మరో టెలికాం సంస్థ వొడాఫోన్ కలిసిపోయిన నాటి నుంచి వినియోగదారులకు ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తోంది. తాజాగా మరో సరికొత్త ప్లాన్ ని ఐడియా వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.  రూ.159 రీచార్జ్ ప్లాన్ ని ఐడియా ప్రవేశపెట్టింది.

ఇటీవలే వొడాఫోన్ కూడా రూ.159 రీచార్జ్ ప్లాన్ ని ప్రవేశపెట్టింది కాగా.. ఇప్పుడు ఐడియా కూడా అదేరకమైన ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో రోజుకి 1జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా లభిస్తాయి. సేమ్ ఇలాంటి ప్లాన్ జియో కూడా అందిస్తోంది. జియో రూ.149 రీచార్జ్ ప్లాన్ లో రోజుకి 1.5జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తున్నాయి.

అదనంగా ఐడియా 100 ఎస్ఎంఎస్ లు చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తోంది. రోజుకి 1జీబీ చొప్పున 28 రోజులు డేటాను వినియోగించుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.  ఇక అన్ లిమిటెడ్ కాల్స్ విషయానికి వస్తే రోజుకి రోజుకి 250 నిమిషాల చొప్పున వారానికి వెయ్యి నిమిషాలు మాట్లాడుకునే అవకాశం ఉంది.