Asianet News TeluguAsianet News Telugu

అమెరికాపై నిఘా నిజమే: బట్ రష్యాతో ‘హువావే’ జట్టు

అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్న అమెరికా టెలికం రంగంలో 4జీ వరకు ప్రపంచ దేశాలను ఏలింది. కారణాలేమైనా 5జీ రంగంలో వెనుకబడింది. ఇక 5జీ నెట్ వర్క్ అభివ్రుద్ధి చేయడంలో అమెరికా కంటే చైనా సంస్థ ‘హువావే’ ముందు ఉంది. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే అమెరికా మిలిటరీపై నిఘా పెట్టేందుకు హువావేకు ప్రత్యేకించి చైనా సైన్యానికి వీలు చిక్కుతుంది. అందుకే హువావేను నిషేధిస్తూ.. తన మిత్ర దేశాలపై ఒత్తిడి తెచ్చింది. హువావే, దాని పరికరాల వాడకానికి పాశ్చాత్య దేశాలు వెుకంజ వేశాయి.

Huawei Signs deal with Russian Telecoms firm to Develop 5G
Author
Moscow, First Published Jun 7, 2019, 12:20 PM IST

బీజింగ్/ మాస్కో: ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువావే కీలక ఒప్పందాన్ని చేసుకుంది. అమెరికాతో పీకల్లోతు వివాదాల్లో మునిగిన హువావే ఇప్పుడు రష్యాతో జత కట్టింది. 5జీ టెక్నాలజీ అభివృద్ధికి రష్యా టెక్నాలజీ సంస్థ ‘ఎంటీఎస్‌’తో భాగస్వామ్య ఒప్పందంపై హువావే సంతకం చేసింది. 

రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రెండు కంపెనీలు ప్రతినిధులు ఈ ఒప్పందంపై  సంతకాలు చేశాయి. వచ్చే ఏట నాటికి ఈ కంపెనీలు రష్యాలో 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేస్తాయి.

2019-20 నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన 5జీ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్ తెలిపింది. రష్యా-చైనా దేశాల వ్యూహాత్మక బంధం ఈ ఒప్పందంతో మరింత బలపడిందని హువావే అధినేత గువోపింగ్ హర్షం వ్యక్తం చేశారు.

కాగా అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందంటూ హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా టెక్నాలజీ వినియోగించి తమ దేశంపైనే గూఢచర్యానికి పాల‍్పడుతోందని ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికాలో తయారయ్యే టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించరాదంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. 

దీంతో హువావే పలు ఇబ్బందుల్లో పడిపోయింది. అమెరికా కనుసన్నల్లో నడిచే  పాశ్చాత్య దేశాలు జాతీయ భద్రతా ప్రమాదం పేరుతో హువావేను బ్లాక్‌ చేశాయి. ఈ నేపథ్యంలో  తాజా ఒప్పందం హువావేకు భారీ ఊరట నివ్వనుంది.

ఇప్పటికే అమెరికా, దాని మిత్రదేశాలు జాతీయ భద్రత పేరుతో చైనాకు చెందిన హువావేను 5జీ రంగంలోకి రాకుండా అడ్డుకున్నాయి. చైనా సైన్యంతో తనకు ఎటువంటి సంబంధం లేదని హువావే పలుమార్లు ప్రకటించినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు హువావే 5జీ పరికరాలను నిషేధించాయి.

ఇక అమెరికా ఇటీవల హువావేకు టెక్నాలజీ సరఫరా లేదా బదిలీపై ఆంక్షలు విధించిన సంస్థల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో రష్యాతో కొత్త డీల్‌తో హువావేకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించనుంది. అయితే అమెరికా కంపెనీలు తయారు చేసే చిప్స్‌ హువావేకు అందే అవకాశాలు లేవు. గూగుల్‌ వంటి కంపెనీలు కూడా హువావేకు సహకరించేందుకు అంగీకరించలేదు. 

టెలికం రంగంలో మార్పులు వేగంగా చోటు చేసుకొంటున్నాయి. 4జీ వరకు ఈ రంగాన్ని అమెరికా టెలికం సంస్థలు దాదాపు ఏలాయి. భారీగా సంపాదించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ భారీగా ఆర్థిక అవకాశాలను కల్పించనుంది.

5జీ అందుబాటులోకి రావడం వల్ల సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, టెలీమెడిసిన్‌, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి వాటిని మరో మెట్టు ఎక్కిస్తుంది.  మిసిసిపీ సెనెటర్‌ రోజర్‌ వైకర్‌ గతంలో మాట్లాడుతూ ‘5జీ టెక్నాలజీలో జాప్యం ప్రజలను వెనుకబాటుతనంలోకి నెట్టివేస్తోంది, దీంతోపాటు ఆర్థిక, సాంఘిక లాభాలను హరించివేస్తుంది.’అని అన్నారు. 

యుద్ధరంగాన్ని కూడా 5జీ టెక్నాలజీ మరో మెట్టు పైకి తీసుకెళుతుంది. హ్యాకింగ్‌, భవిష్యత్‌లో ఆయుధాలకు 5జీ కీలకమైన నెట్‌వర్క్‌. ఇప్పడు 4జీలో 6 నిమిషాల్లో డౌన్‌లోడ్‌ అయ్యేవి 5జీలో అర సెకన్‌లో అవుతుంది. వీడియోలు బఫర్‌ అవ్వవు, 5జీలో కాల్‌ డ్రాప్‌లు ఉండవు.

4జీ టెక్నాలజీలో దాదాపు పదేళ్ల నుంచి ముందు ఉన్న అమెరికా 5జీలో మాత్రం వెనుకబడింది. ఒక వేళ అమెరికా 5జీ టెక్నాలజీలో ముందుంటే 30 లక్షల ఉద్యోగాలను సంపాదించడంతో పాటు జీడీపీకి 500 బిలియన్ల ఊతం లభిస్తుంది. 

5జీ అందుబాటులోకి వస్తే ఆన్‌లైన్‌లో ప్రజలు ఏం చేస్తున్నారో కూడా ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు టెలికం పరికరాలను ఉత్పతి చేయడంతో మేటి సంస్థగా ఉన్న చైనా ‘హువావే’ 5జీ టెక్నాలజీలో ముందుంది.

దీంతో చైనాకు ఈ రంగంపై పట్టు వస్తే అమెరికాపై  నిఘాపెట్టే అవకాశం లభిస్తుంది. అందుకే ఇటీవల అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హువావే వినియోగంపై ఆంక్షలు విధించారు. 

ఇప్పుడు తాజాగా హవావే అమెరికా బద్ధ విరోధి రష్యాకు 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. సైబర్‌వార్‌ఫేర్‌లో రష్యాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే రక్షణ పరంగా చైనా, రష్యా బంధాన్ని ఐరన్‌ బ్రదర్స్‌గా విశ్లేషకులు పోలుస్తారు.

అమెరికాకు వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో ఈ రెండు దేశాలు ఏకం అయ్యాయి. ఇప్పుడు 5జీ రంగంలో ఈ రెండు జత కట్టడం అగ్రరాజ్యం అమెరికాకు కష్టకాలమేనని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios