Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ ఎఫెక్ట్: తగ్గిన ‘హువావే’గ్లోబల్ సేల్స్..30% ప్రొడక్షన్ తగ్గించిన రెన్ జెంగ్ ఫై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షల ప్రభావం చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’పై గణనీయంగానే పడింది. అంతర్జాతీయంగా 40 శాతం సేల్స్ తగ్గిపోయాయి. దీంతో వచ్చే రెండేళ్లలో 30 శాతం ఉత్పత్తిని తగ్గించాలని హువావే వ్యవస్థాపక సీఈఓ రెన్ జెంగ్ ఫై నిర్ణయించారు.

Huawei phone sales plunge, cutbacks planned as US pressure bites
Author
Shenzhen, First Published Jun 19, 2019, 10:19 AM IST

షెన్‪జెన్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ హువావే సేల్స్ విదేశాల్లో తగ్గుముఖం పట్టాయని సంస్థ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ ఫై పేర్కొన్నారు. గత నెలలో హువావేపై నిషేధం విధించాలని, బ్లాక్ లిస్టులో పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. 

తద్వారా అమెరికా ఆంక్షల ప్రభావం తమపై పడిందని పరోక్షంగా పడిందని హువావే పరోక్షంగా అంగీకరించినట్లైంది. అంతర్జాతీయంగా హువావే సేల్స్ 40 శాతం తగ్గుముఖం పట్టాయని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్ జెంగ్ ఫై కూడా అంతర్జాతీయంగా విక్రయాలు 40 శాతం తగ్గిన మాట నిజమేనని అంగీకరించారు. అంతకుమించి వివరాలు వెల్లడించారు. మే నుంచి జూన్ వరకు సేల్స్ తగ్గాయని యువావే అధికార ప్రతినిధి తెలిపారు. అయితే దేశీయంగా చైనాలో మాత్రంగా శరవేగంగా సేల్స్ సాగుతూ ఏన్నాయని రెన్ జెంగ్ ఫై చెప్పారు. 

టెక్ దిగ్గజం ఆపిల్‌, దక్షిణ కొరియా సంస్థ మేజర్ స్మార్ట్ ఫోన్ సంస్థతో పోటీ పడుతూ గతేడాది స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తులు, విక్రయాల్లో రెండోస్థానంలో నిలిచింది. 2018 ఫిబ్రవరిలో 206 మిలియన్ల యూనిట్ల స్మార్ట్ ఫోన్లను అమ్ముడు పోయాయి. అందులో సగం చైనాలో అమ్ముడు పోగా, సగం సేల్స్ విదేశాల్లో సాగాయి. 

వచ్చే రెండేళ్లలో ఉత్పత్తి వ్యయం 30 బిలియన్ల డాలర్లు తగ్గించాలని నిర్ణయించినట్లు హువావే అధినేత రెన్ జెంగ్ ఫై చెప్పారు. గతేడాది 100 బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయం సంపాదించింది. గతేడాది ఆదాయంలో 30 శాతం వ్యయం ఉంటుందని అంచనా. తిరిగి 2021 నాటికి తమ స్థానాన్ని సాధిస్తుందని రెన్ చెప్పారు. 

హువావే తాను గూడచర్యానికి పాల్పడినట్లు రుజువులు చెప్పాలని డిమాండ్ చేసింది. చైనా ప్రభుత్వం కూడా అదే స్పష్టం చేసింది. 5జీ నెట్ వర్క్‌లో శరవేగంగా విస్తరిస్తున్న హువావే అంటే అమెరికా ప్రభుత్వానికి, ఆ దేశ టెలికం సంస్థలకు వణుకు పుట్టింది. ఫేస్ బుక్, గూగుల్ తదితర సంస్థలను హువావే సంస్థకు సేవలందించబోమని తేల్చి చెప్పాయి గూడా. అయితే అమెరికా 90 రోజుల గడువు విధించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios