ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల బిజినెస్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్న హువావే అగ్ర కంపెనీలకు షాకిచ్చింది. చైనా - అమెరికా మధ్య  వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు చైనా కంపెనీ హువావే పై ఆంక్షలు విదించండంతో గూగుల్ కూడా ఓఎస్ ను అందించడంలో వెనుకడుగు వేసింది. 

90రోజుల గడువు ఇవ్వడంతో హువావే ఊహించని విధంగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'హాంగ్‌మెంగ్‌’ ను తాయారు చేసుకుంది. ఈ ఓఎస్ గనక క్లిక్కయితే యాపిల్ - గూగుల్ లకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే హువావే మొబైల్స్ అమ్మకాల్లో రెండవ స్థానానికి ఎగబాకింది. హాంగ్‌మెంగ్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ను చైనాలో ప్రవేశపెట్టగా మంచి స్పందన వచ్చినట్లు  హువావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియమ్సన్ ఇంటర్వ్యూలో తెలిపారు. 

అమెరికా కంప్యూటర్ నెట్వర్క్ కి శత్రు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు గత నెల హువావే కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టారు. సంస్థ లావాదేవీలు సైతం నిషేధించడంతో హువావేకి భారీ షాక్ తగిలింది. అయినప్పటికీ హువావే ధీటుగా అతి తక్కువ వ్యవధిలో ఓఎస్ ని రెడీ చేసుకుంది. ఇప్పుడున్న హువావే పోన్లన్నిటిలో గూగుల్ ప్లే స్టోర్ కి సంబందించిన యాప్స్ పని చేయనట్లే.. అయితే గూగుల్ తరహాలో హాంగ్‌మెంగ్‌ ఓఎస్ భారతీయులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.