న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు హువావే, హానర్ సంస్థలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చాయి. తన స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తున్న హువావే ఈ-కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ ద్వారా రూ.15వేల రూపాయల దాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ- కామర్స్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రత్యేకించి హువావే హాలిడే సేల్‌ను విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌,  క్రెడిట్‌ కార్డు ద్వారా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1500 తక్షణ డిస్కౌంట్‌తోపాటు నో కాస్ట్‌ ఈఎంఐ వసతిని కూడా హువావే కల్పిస్తోంది.  హువావే  పీ20లైట్‌, పీ 20ప్రొ నోవా 3ఐ, నోవా 3స్మార్ట్‌ఫోన్లపై ఈ భారీ డిస్కౌంట్లను హువావే ప్రకటించింది. 


హువావే పీ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15వేల రూపాయల భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. హాలిడే సేల్‌‌లో భాగంగా హువావే పీ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌​ రూ. 54,999లకే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. 6.1 అంగుళాల డిస్‌ప్లేతోపాటు 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌, 40+24+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర వసతులు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. 


హువావే పీ 20లైట్‌ మోడల్ స్మార్ట్ ఫోన్‌పై ఇచ్చే రూ. 8వేల డిస్కౌంట్‌ తర్వాత రూ.14,999 లకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 5.84 అంగుళాల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌,64జీబీ స్టోరేజ్‌, 24+16ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీకెమెరా, 3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ లభిస్తాయి. 

ఇక హువావే నోవా 3ఐ మోడల్ స్మార్ట్ ఫోన్‌పై రూ.7వేల డిస్కౌంట్‌ అందజేస్తోంది. దీంతో హువావే నోవా 3ఐ మోడల్ స్మార్ట్ ఫోన్ రూ. 16,990 లకే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌,16+2ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్‌ రిసెల్ఫీ కెమెరా, 3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 

నోవా 3 స్మార్ట్ ఫోన్‌పై హువావే రూ.10వేల తగ్గింపు అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత ‘నోవా3’స్మార్ట్ ఫోన్ రూ. 29,999లకే లభిస్తోంది. ఇందులో 6.3 అంగుళాల డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, 24+16ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్‌  సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు లభిస్తాయి. 

హానర్ నుంచి ఇలా ఆఫర్లు
మరో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ‘హానర్’ సైతం వినియోగదారులకు రూ.3000 వరకు డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. హానర్ 9ఎన్, హానర్ 7ఎ, హానర్ 7ఎస్, హానర్ 9లైట్, హానర్ 9ఐ స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు లభిస్తాయి. శనివారం వరకు వర్తించే ఈ ఆఫర్లు కేవలం ‘ఫ్లిప్ కార్ట్’ ద్వారా కొనుగోలు చేస్తే వర్తిస్తాయి. 

హానర్ 9ఎన్ మోడల్ ఫోన్ 3జీ వేరియంట్ మోడల్ రూ.3000 డిస్కౌంట్ ధరతో రూ.8,999లకు, 4జీబీ ర్యామ్ వేరియంట్ రూ.10,999లకు లభిస్తుంది. ఇక హానర్ 7ఎ ఫోన్ రూ.8,4999 నుంచి రూ.7,499లకు లభిస్తుంది. హానర్ 7ఎస్, హానర్ 9 లైట్ మోడల్ ఫోన్లు రెండింటిపై రూ.1000 డిస్కౌంట్ కల్పిస్తోంది. దీని ప్రకారం హానర్ 7ఎస్ రూ.5999, హానర్ 9 లైట్ రూ.9999లకు లభిస్తుంది. చివరిగా హానర్ 9ఐ మోడల్ ఫోన్ డిస్కౌంట్ పై రూ.11,999లకు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.