ట్విటర్ ప్రకటనతో నిర్దారణ
ప్రత్యేకతలకంటే మరింత మెరుగైన ఫోన్ అంటూ ముందస్తు ప్రచారం.
తైవాన్ తయారీదారు ఫ్లాగ్ షిప్ ఫోన్

తైవాన్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హెచ్‌టిసి ఎట్టకేలకు కొత్త వెర్షన్ ప్రారంభ తేదీని ప్రకటించింది. తన ఫోన్ వివరాల గురించి కంపెనీ వెల్లడించలేదు కానీ చాలా కాలంగా వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ 2018 కి గానూ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ హెచ్‌టిసి యు12+ ని మే 23న లాంచ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. హెచ్‌టిసి యు11 సీరీస్‌లో తరువాయి భాగమైన ఈ ఫోన్ యు12 రకాన్ని దాటేసి యు12+తో ముందుకొస్తోంది. 

ట్విట్టర్ ద్వారా ఇటీవలే తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ప్రకటించిన కంపెనీ తేదీతోపాటు కమింగ్ సూన్ అనే కేప్షన్‌ని ప్రదర్సించింది. స్మార్ట్ ఫోన్ గురించి ఎలాంటి వివరాలను నిర్దిష్టంగా వెల్లడించని కంపెనీ ట్విట్టర్‌లో ఫోన్ ఇమేజ్ నేపధ్యంలో ఫోన్ విడిభాగాల గురించి ప్రదర్శించడం ద్వారా 2018లో పోటీక్ తాను సిద్ధమని వ్యక్తపర్చుకుంది. ప్రచారంలో ఉన్న రూమర్ల బట్టి వెనుకభాగంలో రెండు కెమెరాలు ఉంటాయని 189 డిస్‌ప్లేతో తయారైందని తెలుస్తోంది. 

ముందువైపున 8 మెగా పిక్సెల్స్‌ సెన్సర్స్ మరియు వెనుకవైపున రెండు 12 మెగాపిక్సెల్స్ సెన్సర్లు ఉంటాయని తెలుస్తోంది. క్యుహెచ్‌డి రిజల్యూషన్‌తో కూడిన 5.99 అంగుళాల ఎల్‌సిడి ప్యానెల్‌తో ఇది తయారైందని ఊహిస్తున్నారు. క్వాంటమ్ స్నాప్ డ్రాగన్ 845 ఎస్ఓసీ, 6 జీబీ ర్యామ్, 64 మరియు 128 జీబీతో కూడిన రీబిల్ట్ స్టోరేజ్, 3420 ఎమ్ఎహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు.

బయటికి వస్తున్న లీకుల బట్టి హెచ్‌టిసి యు12+ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను సపోర్టు చేస్తుంది. అలాగే ఎల్‌ఇడి ఫ్లాష్, ముందవైపున ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను వేటినీ కంపెనీ అధికారికంగా ఇంతవరకు తెలుపనప్పటికీ 2018 సంవత్సరానికి గానూ కంపెనీ అధునాతన స్మార్ట్ ఫోన్‌తోనే వస్తున్నట్లు వార్తలు పదే పదే వచ్చాయి. 

ఈ కంపెనీ ఇంజనీరింగ్ విభాగంలో అధిక భాగాన్ని గూగుల్ స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో తాజా వెర్షన్ మొబైల్ విడుదల తేదీని ప్రకటించడం కస్టమర్లకు కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.