Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్, హలో యాప్ లకు కేంద్రం షాక్

  • టిక్ టాక్, హలో యాప్ లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
  • చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు
  • 21ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేసిన కేంద్రం
  • సరైన సమాధానం ఇవ్వకుంటే దేశంలో నిషేధిస్తామంటూ హెచ్చరిక
Govt concerned TikTok, Helo used for anti-India and illegal activities, may ban them
Author
Hyderabad, First Published Jul 18, 2019, 4:01 PM IST


ఇటీవల కాలంలో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న టిక్ టాక్, హలో యాప్ లకు  కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు యాప్ లు చట్ట విరుద్ద కార్యకాలపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న నేపథ్యంలో...  సదరు యాప్ యాజమన్యాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 21ప్రశ్నలతో కూడా నోటీసులను పంపిస్తూ...వాటికి సమాధానం చెప్పాలని చెప్పింది. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే వాటిని దేశంలోనే నిషేధిస్తామని కేంద్రం హెచ్చరించింది.

ఈ రెండు యాప్ లపై వచ్చిన ఆరోపణలపై ఐటీ శాఖ ఆయా కంపెనీలను వివరణ కోరింది. వినియోగదారులకు సంబంధించిన సమాచారం.. భవిష్యత్తులో గానీ ఇతర దేశాల వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయమని హామీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రాజకీయ ప్రకటనల కోసం ఈ సంస్థలు డబ్బులు ఖర్చు పెడుతున్నాయని వచ్చిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాలని కోరింది.

18ఏళ్ల లోపు వారికి ఈ యాప్ ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. కొద్ది నెలల క్రితం దేశంలో టిక్ టాక్ యాప్ ని కొద్ది రోజులు నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా.. తర్వాత ఆ యాప్ ని మళ్లీ పునరుద్ధరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios