Asianet News TeluguAsianet News Telugu

హువావేకు కష్టకాలమే: తమ ఆండ్రాయిడ్ సేవలు ఉండవని తేల్చేసిన గూగుల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం ప్రభావం చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే’పై గణనీయంగానే ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు హువావే ఫోన్లలో అన్ని సేవలు లభించినా.. ఇకముందు ఆ ఫోన్లు కొనుగోలు చేసేవారికి తమ ఆండ్రాయిడ్ సేవలు అందుబాటులో ఉండవని గూగుల్ తేల్చేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ యూరప్ దేశాల్లో దీని ప్రభావం గణనీయంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Google restricts Huawei's use of Android after Trump's blacklist
Author
New York, First Published May 20, 2019, 2:48 PM IST

న్యూయార్క్: చైనా స్మార్ట్ దిగ్గజం ‘హువావే’ ఫోన్ వినియోగదారులు ఓపెన్ సోర్స్ లైసెన్స్ ద్వారా ఆండ్రాయిడ్ సేవలు పొందొచ్చు. కానీ ఇక ముందు మార్కెట్లోకి వచ్చే హువావే ఫోన్లలో జీ-మెయిల్, యూ-ట్యూబ్, గూగుల్ క్రోమ్ వంటి యాప్స్ లభించవు. అదంతే చైనాతో వాణిజ్య యుద్ధం కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పేరెత్తకుండానే హువావే సంస్థపై నిషేధం విధించిన ఎఫెక్ట్ మరి. 

టెక్నాలజీ పరమైన అంశాలపై హువావే గూడచర్యానికి పాల్పడుతున్నదని, దాంతో ఎవరూ లావాదేవీలు, సంబంధాలు పెట్టుకోవద్దని ట్రంప్ దేశీయ కంపెనీలకు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో .. హువావేతో హార్డ్ వేర్, సాప్ట్ వేర్ ట్రాన్స్‌ఫర్ తోపాటు ఇతర టెక్నికల్ సర్వీసుల బిజినెస్‌ను ఆల్పాబెట్ ఇంక్స్ ‘గూగుల్’సస్పెండ్ చేసింది. ఓపెన్ సోర్స్ లైసెన్సు కింద లభించే వనరులకు మాత్రం మినహాయింపు లభిస్తుంది. 

గూగుల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత స్మార్ ఫోన్ వినియోగదారులు ఇప్పటివరకు గూగుల్ అప్ డేటెడ్ యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు’ అని తెలిపారు. తాము ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత హువావే వినియోగదారులకు గూగుల్ ప్లే, సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ లభిస్తాయన్నారు. 

దీని ప్రకారం గూగుల్‌కు సంబంధించి పబ్లిక్ వర్షన్ ఆండ్రాయిడ్ సేవలు మాత్రమే పొందగలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ‘హువావే’ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇక ముందు తమ దేశీయ టెక్నికల్ సంస్థల సేవలు, వాటి యాప్స్ అందుబాటులోకి రానివ్వొద్దని అమెరికా ఆదేశించినట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత లేదు. అమెరికా మద్దతు లేకుండా ఆండ్రాయిడ్ సిస్టమ్‌ను హువావే పొందగల సామర్థ్యం ఉన్నదా? అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

హువావే న్యాయవాదులు సైతం అమెరికా నిషేధాజ్నల ప్రభావంపై అద్యయనం జరుపుతున్నారు. అంతర్గతంగా గూగుల్ ప్రతినిధులతోచర్చిస్తున్నారని తెలుస్తోంది. కానీ హువావే దీనిపై అధికారికంగా స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. అమెరికా వాణిజ్యశాఖ అధికారులు కూడా ప్రతిస్పందించలేదు. 

ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సేవలను వాడుకుంటున్న ఫోన్ వినియోగదారులు 250 కోట్ల మంది ఉంటారని గూగుల్ అంచనా. వారిలో హువావే ఫోన్ వినియోగదారులు కూడా ఉంటారు. కనుక కోట్ల మంది హువావే ఫోన్ కస్టమర్లకు టెక్నికల్ సపోర్ట్, ప్రొపైటరీ యాప్స్, సర్వీసెస్ తో కూడిన ఆండ్రాయిడ్ సేవలు అందుబాటులో లేకుండా చేస్తే దాని ప్రభావం బాగానే ఉంటుంది. అయితే తాము సొంతంగా ఆండ్రాయిడ్ సేవల అభివ్రుద్ధిపై ద్రుష్టి సారించామని హువావే పేర్కొనడం గమనార్హం. గత మార్చిలోనే హువావే చైర్మన్ ఎరిక్ క్జూ ఈ సంగతి చెప్పారు. ఒకసారి సంస్థపై నిషేధం అమలులోకి వస్తే ఆండ్రాయిడ్ సేవలు వాడుకునే వారికి ఓపెన్ సోర్స్ లైసెన్స్ ద్వారా యాప్స్ సేవలు అందుకునే హక్కు ఉండదని ఎరిక్ క్జూ తెలిపారు. 

యూరప్ వంటి పోటీ మార్కెట్లలో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు నిలబడాలంటే ఆండ్రాయిడ్ యాప్స్ ప్రత్యేకించి గూగుల్ యాప్స్ మద్దతు చాలా కీలకం అని సీసీఎస్ ఇన్ సైట్ వైస్ ప్రెసిడెంట్ జియోఫ్ బ్లాబెర్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం హువావేపై యూరప్ దేశాల్లో బాగానే పడుతుందని తెలుస్తోంది. దీనికి ప్రతిగా గూగుల్ మొబైల్ యాప్స్ అన్నీ చైనాలో నిషేధించారు. యూజర్లు తమకు ఆ సేవలు అవసరమైతే టెన్సెంట్, బైడు వంటి సంస్థల నుంచి పొందాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios