Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ న్యూస్... మరో 48గంటల్లో ఇంటర్నెట్ షట్ డౌన్

రానున్న 48 గంటల్లో డొమైన్లు ఏవీ పనిచేయవని సమాచారం. ఈ మేరకు రష్యా టుడే మీడియా చానెల్ వెల్లడించింది. మెయిన్ డొమైన్ సర్వర్లు, వాటికి సంబంధించిన నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొంత సేపు ఆగిపోనున్నాయని తెలిపింది. 

Global Internet Shutdown Likely Over Next 48 Hours: Report
Author
Hyderabad, First Published Oct 12, 2018, 11:50 AM IST

ఇంటర్నెట్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. మరో 48గంటల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ కానుంది. మీరు చదివింది నిజమే. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులు నెట్ వర్క్ సమస్యను ఎదుర్కోనున్నారు.

సర్వర్ల సాధారణ నిర్వహణలో భాగంగా రానున్న 48 గంటల్లో డొమైన్లు ఏవీ పనిచేయవని సమాచారం. ఈ మేరకు రష్యా టుడే మీడియా చానెల్ వెల్లడించింది. మెయిన్ డొమైన్ సర్వర్లు, వాటికి సంబంధించిన నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొంత సేపు ఆగిపోనున్నాయని తెలిపింది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లకు కొంత సమయం పాటు నెట్ సదుపాయం ఉండదని పేర్కొంది. 

ది ఇంటర్నెట్ కార్పోరేషన్ ఆఫ్ ఆసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ICANN) ఈ సర్వర్ల మెయింటనెన్స్ వర్క్‌ను చేపడుతోంది. ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేసి ఆ సమయంలో క్రిప్టోగ్రాఫిక్ కీని మారుస్తుంది. ఇది ఇంటర్నెట్ అడ్రస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్(DNS)ను భద్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇటీవల పెరిగిన సైబర్ దాడుల నేపథ్యంలో హ్యాకర్లకు కౌంటర్ ఇవ్వడానికి ఈ మార్పును ఐసీఏఎన్ఎన్ చేస్తోంది. ఈ మేరకు కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) ఒక ప్రకటనను విడుదల చేసింది. 

సురక్షితమైన డొమైన్ నేమ్ సిస్టమ్(DNS) కోసం కొంతసేపు గ్లోబల్ ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేయకతప్పదు అని సీఆర్ఏ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ మార్పుల కోసం ముందుగా సంసిద్ధం కాని కొన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవడైర్లకు చెందిన వినియోగదారులకు అసౌకర్యం తప్పదని వెల్లడించింది. కాబట్టి రాబోయే 48 గంటల్లో ఇంటర్నెట్ యూజర్లు వెబ్ పేజెస్ ఓపెన్ చేయడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios