ఇక ఫ్లిప్ కార్ట్ నుంచి అప్పు కూడా తీసుకోవచ్చు

Flipkart set for financial services foray; to lend to consumers and sellers
Highlights

ఆన్‌లైన్‌ విక్రయాల్లో అమెరికా దిగ్గజం అమెజాన్‌కు దీటుగా ఎదిగిన దేశీయ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌. ఇటీవలే ఈ సంస్థను అమెరికా రిటైల్‌ అగ్రశ్రేణి సంస్థ వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన సంగతి విదితమే. 

ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా వస్తువులు కొనుగోలు చేసి ఉంటారు. అయితే ఇక నుంచి ఫ్లిప్ కార్ట్ నుంచి అప్పు కూడా తీసుకోవచ్చు. మీరు చదివింది నిజమే.. ఆర్థిక సేవలపై దృష్టి సారించిన సంస్థ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్‌ పొందేందుకు దరఖాస్తు చేస్తోంది. 

తొలుత తమ వద్ద ఉత్పత్తులు కొనుగోలు చేసే వారికి, తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలు జరిపే వారికి ఈ సేవలు అందించి, క్రమంగా ఇతరులకూ విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక. దీంతోపాటు బీమా పథకాలను కూడా విక్రయించనుంది. మూడు నెలల్లో ఈ సేవలు ప్రారంభించాలన్నది సంస్థ యోచిస్తోంది.

ఆన్‌లైన్‌ విక్రయాల్లో అమెరికా దిగ్గజం అమెజాన్‌కు దీటుగా ఎదిగిన దేశీయ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌. ఇటీవలే ఈ సంస్థను అమెరికా రిటైల్‌ అగ్రశ్రేణి సంస్థ వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లక్ష మంది వ్యాపారులు విక్రయాలు జరుపుతుండగా, 10 కోట్ల మంది నమోదిత వినియోగదారులున్నారు. ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ దరఖాస్తు చేస్తోంది.

 ఇది సాకారమైతే, వీరందరికీ రుణాలిచ్చే వీలు సంస్థకు కలుగుతుంది. పేటీఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ తరహాలో క్రమంగా ఇతరులకూ ఈ సేవలు విస్తరించాలన్నది సంస్థ యోచనగా చెబుతున్నారు. 3 నెలల్లో ఈ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.

loader