న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి ఆఫర్ల పండుగను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్‌ ఎండ్‌ మొబైల్స్‌ఫెస్ట్‌ పేరుతో  ఐదు రోజులు అంటే ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది.

ఇందులో వివిధ స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రెడ్‌మీ వై2, రెడ్‌ మీ 6,  రియల్ మీ 2 ప్రొ పై డిస్కౌంట్లను ఆఫర్లను అందిస్తోంది. రెడ్‌మీ 6పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

షియోమీ అనుబంధ రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్‌ 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.6,999కే అందుబాటులోకి తెచ్చింది. దీని అసలు ధర రూ.10,499. రియల్‌ మీ 2 ప్రొ ఫోన్ ధర రూ. 8,999కు లభిస్తుంది. దీని అసలు ధర  రూ.13,990. దీంతోపాటు సాధారణ ఎక్స్చేంజ్‌తో పోలిస్తే అదనంగా ఫ్లిప్‌కార్ట్‌ రూ.1000 రాయితీ ఇవ్వనున్నది.

ఇంకా హానర్‌, వివో, శామ్‌సంగ్‌, ఆసుస్‌  బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై కూడా తక్కువ ధరలను ప్రకటించింది. శామ్‌సంగ్‌ ఎ50 ఫోన్ పై అదనంగా రూ.2000 రాయితీ అందిస్తోంది. ఒప్పో ఎ5 (4జీబీ విత్ 64జీబీ) ఫోన్ ధర రూ.15,990 కాగా, రూ.9990లకు లభిస్తుంది. రెడ్ మీ వై2 ఫోన్ రూ.10,499 అయితే రూ.7,499లకే లభ్యం కానున్నది.  

ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన మోటరోలా వన్ విజన్ ఫోన్‌పై రూ.2000 రాయితీ లభిస్తుంది. అసుస్ 5జడ్ (8జీబీ విత్ 256 జీబీ) ఫోన్ రూ.36,999 నుంచి రూ.23,999 లభిస్తుంది. అసుస్ మ్యాక్స్ ఎం2 ఫోన్ ధర నూ.12,999 కాగా, రూ.5000 రాయితీ లభిస్తుంది..

హానర్ 10 లైట్ ఫోన్ ధర రూ.13,999 కాగా, ఫ్లిప్ కార్ట్ మంత్లీ సేల్ లో రూ.5000 రాయితీ లభిస్తుంది. హానర్ ప్లే ఫోన్ పై రూ.10 వేల రాయితీతో కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ.21,999.

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్ ఫోన్లపై అదనంగా రూ.5000, నో కాస్ట్ ఆప్షన్లు, సెలెక్ట్ పేమెంట్ మెథడ్స్‌తో రాయితీతో అందుబాటులోకి వస్తుంది. గూగుల్ పిక్సెల్ 3ఏ ఫోన్‌పై రూ.3000 అదనపు రాయితీ లభించనున్నది.