Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... భారీ ఆఫర్లు

ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు, ఇతర కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఫ్లాట్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.

Flipkart announces Big Billion Days sale, claims it is the biggest sale ever on the site
Author
Hyderabad, First Published Sep 22, 2018, 11:39 AM IST

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి ఆఫర్ల మేలా ప్రకటించింది. త్వరలోనే అతిపెద్ద బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ లో ఫ్లిప్ కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. 

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతీసారి 10 శాతం డిస్కౌంట్‌ను పొందుతున్నారు. ఈ సేల్‌ను ప్రమోట్‌ చేస్తూ.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ముందస్తు సేల్స్‌ కంటే ఈ సేల్‌ అతిపెద్దదిగా ఉండబోతున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు, ఇతర కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఫ్లాట్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.

దీని కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ఓ పేజీని కూడా కేటాయించింది. సేల్‌ ప్రారంభమయ్యే సమయంలోనే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను కంపెనీ రివీల్‌ చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని మాత్రమే బహిర్గతం చేసింది. ఇతర బ్యాంకులపై కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించబోతుంది. ప్రొడక్ట్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. 

మరో సూపర్ అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ సేల్ ఏతేదీ నుంచి ప్రారంభించనున్నారో ముందే గెస్ చేసి కంపెనీకి తెలియజేస్తే.. వారికి ఉచితంగా వోచర్స్ గెలుచుకోవచ్చు. ఆ ఓచర్స్ మీకు నచ్చినవి కొనుగోలు చేసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios