కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్​డౌన్ విధించాయి. ఈ సమయంలో ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. కరోనావైరస్‌ సమాచారం కోసం చాలా మంది ఈ లైవ్‌వీడియోలను చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోలను ఫేస్‌బుక్‌ ఖాతాలేని వారు చూసేందుకు వీలుండేది కాదు.

అయితే ఇప్పుడు ఖాతా లేకున్నా లైవ్‌ వీడియోలను వీక్షించేలా ఫేస్‌బుక్ సరికొత్త వసతిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే డెస్క్‌టాప్‌ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్​ మొబైల్ యూజర్లకు తాజాగా అందుబాటులోకి వచ్చింది.

త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్ బుక్ కృషి చేస్తోంది‌. మరో వారంరోజుల్లో ఐఓఎస్‌ యూజర్లకు ఈ వసతి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. దీంతోపాటు పబ్లిక్​ స్విచ్​​ టెలిఫోన్ నెట్​వర్క్​అనే ఓ సరికొత్త వసతిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కాల్ నెంబర్ ద్వారా లైవ్​స్ట్రీమ్​ల ఆడియోలు ఫోన్‌ద్వారా వినొచ్చు.

ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఫేస్​బుక్​ వినియోగం అధికం అవుతోంది. 70 శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు గ్రూప్ వీడియో కాల్స్ చేయడం, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​లను వీక్షించటానికి సమయం వెచ్చిస్తున్నారు. 

Also read:మహీంద్రా ముందడుగు: నేటి నుంచి ఫేస్‌షీల్డ్‌ తయారీ

ఈ కారణంగా ఇంటర్నెట్‌ వినియోగంపై భారాన్ని తగ్గించేందుకు భారత్​, లాటిన్​ అమెరికాల్లో వీడియో నాణ్యతను తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ప్రకటించాయి. లైవ్ స్ట్రీమ్ ఫీచర్ ఆండ్రాయిడ్ వసతి గల స్మార్ట్ ఫోన్లలో ఇప్పటికే లభిస్తున్నది. దీన్ని ఐఓఎస్ ఫోన్లకు విస్తరించనున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది.