Asianet News TeluguAsianet News Telugu

డేటా లీక్ నిజమే, 52 కంపెనీలతో షేర్ చేశాం: ఫేస్‌బుక్!

ఫేస్‌బుక్ డేటా లీక్ విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఫేస్‌బుక్ తమ వినయోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలతో పంచుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ విషయంపై కంపెనీ వివరణ ఇచ్చింది.

Facebook data leak via quiz app; faces new accusation

ఫేస్‌బుక్ డేటా లీక్ విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఫేస్‌బుక్ తమ వినయోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలతో పంచుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ విషయంపై కంపెనీ వివరణ ఇచ్చింది. తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా 52 కంపెనీలతో పంచుకున్నామని, వాటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని ఫేస్‌బుక్‌ పేర్కొంది.

ఫేస్‌బుక్‌లో ఓ క్విజ్ అప్లికేషన్‌లోని సెక్యూరిటీ లోపం కారణంగా కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇతర సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్ సంస్థ మాత్రం చాలా సింపుల్‌గా పొరపాటు జరిగిపోయింది, క్షమించండంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇదంతా చేసింది ఫేస్‌బుక్‌లో Nametests.com అనే అప్లికేషన్.

ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ అమెరికన్ కాంగ్రెస్‌కు సమర్పించిన 700 పేజీల నివేదికలో వివరించింది. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్‌బుక్‌ ఒప్పందం కుదుర్చుకుందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ అమెరికన్‌ కాంగ్రెస్‌కు వివరణ ఇచ్చింది. ఈ మేరకు తమ నివేదికను అమెరికన్‌ ప్రతినిధుల సభకు చెందిన హౌస్‌ ఎనర్జీ అండ్‌ కామర్స్‌ కమిటీకి ఫేస్‌బుక్‌ అందజేసింది.

సెల్‌ఫోన్ తయారీ కంపెనీలైన యాపిల్, బ్లాక్‌బెర్రీ, పాన్‌టెక్, శాంసంగ్, హుయావ్, లెనెవో, ఒప్పోలతో పాటుగా ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలైన అమెజాన్, అలీబాబా, టెక్ కంపెనీలైన క్వాల్‌కాం, పాన్‌టెక్, టిసిఎల్ వంటి సంస్థలతో పాటుగా మొత్తం 52 కంపెనీలతో కస్టమర్ల డేటా షేర్ అయినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

మీ స్నేహితుల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీ జీవితభాగస్వామి పేరేంటి? ఫలానా సినిమాలో మీరు ఏ క్యారెక్టర్‌కి సరిపోతారు? రామాయణంలో మీరు ఏ పాత్రకు సరిపోతారు? మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అంటూ పిచ్చి ప్రశ్నలతో కూడిన పోస్టులను మనం నిత్యం ఫేస్‌బుక్‌లో చూస్తూనే ఉంటాం. నిజానికి ఇదొక పెద్ద డేటా లీక్ స్కామ్. ఇలాంటి అప్లికేషన్లు ఓ చిన్నపాటి ప్రశ్నను సంధించి, దానికి మీరు సమాధానం ఇవ్వగానే హ్యాకర్లు మీ అకౌంట్‌లోకి ప్రవేశించి కీలకమైన సమాచారాన్ని చోరీ చేసేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మేల్కొని, ఇలాంటి పిచ్చి అప్లికేషన్ల జోలికిపోయి మీ కీలకమైన సమాచారాన్ని 'నెట్'ఇంటి నేరగాళ్లకు చేరకుండా జాగ్రత్త పడండి.

 

Follow Us:
Download App:
  • android
  • ios