న్యూఢిల్లీ: ఇండియన్ స్టార్టప్‌ సంస్థ‌లలో చైనా పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో చైనా పెట్టుబడులు మన దేశీయ స్టార్టప్‌‌లలో 12 రెట్లు పెరిగినట్టు డేటా, అనలటిక్స్ సంస్థ గ్లోబల్‌‌ డేటాలో వెల్లడైంది. అంటే 2016లో 381 మిలియన్ డాలర్లుగా (రూ.2,881 కోట్లు) ఉన్న ఈ పెట్టుబడులు, 2019 నాటికి 4.6 బిలియన్ డాలర్లకు(రూ.34,788 కోట్లు) పెరిగినట్టు చెప్పింది. 

మెజార్టీ పెట్టుబడులు ఇండియాలోని యూనికార్న్‌‌లోకే వచ్చాయి. ఈ యూనికార్న్‌‌లకు చైనా ఇన్వెస్ట్‌‌మెంట్ సంస్థలు, కార్పొరేటర్లు తమ పెట్టుబడులతో మద్దతు‌గా నిలుస్తున్నారు. 24 యూనికార్న్‌‌ల్లో 17 యూనికార్న్‌‌లకు చైనాకు చెందిన అలీబాబా, టెన్సంట్ వంటి చైనీస్ ఇన్వెస్ట్‌‌మెంట్ సంస్థలు, కార్పొరేట్లు అండగా ఉన్నట్టు గ్లోబల్‌‌డేటా వెల్లడించింది.

అలీబాబా, దాని సంబంధిత సంస్థ యాంట్ ఫైనాన్సియల్, ఇతర సంస్థలు కలిసి నాలుగు ఇండియన్ యూనికార్న్‌‌లు పేటీఎం, శ్నాప్‌‌డీల్, బిగ్‌‌బాస్కెట్, జొమాటోలోకి 2.6 బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెట్టాయి. టెన్సెంట్, ఇతర సంస్థలతో కలిసి ఐదు యూనికార్న్‌‌లు ఓలా, స్విగ్గీ, హైక్, డ్రీమ్11, బైజూస్‌‌లో 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 

బిలియన్ డాలర్లు, ఆపై వాల్యుయేషన్ కలిగి ఉన్న స్టార్టప్‌‌లను యూనికార్న్‌‌లు అని అంటారు. ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌లో ఉన్న యాక్టివ్‌‌గా ఉన్న ఇతర చైనీస్ ఇన్వెస్టర్లలో హిల్‌‌హౌస్ క్యాపిటల్ గ్రూప్, చైనా లాడ్జింగ్ గ్రూప్, దీదీ చుక్సింగ్, ఫోసన్, చైనా–యురేషియా ఎకనమిక్ కోఆపరేషన్ ఫండ్లు ఉన్నాయి. గతేడాది వరకు, చైనా ఇండియన్ టెక్ స్టార్టప్‌‌లలో బాగా పెట్టుబడులు పెట్టినట్టు గ్లోబల్ డేటా టెక్ అనలిస్ట్ కిరణ్ రాజ్ అన్నారు.

భారత్​కు వచ్చిన ఈ పెట్టుబడుల్లో 17 నుంచి 24 శాతం చైనాకు చెందిన రెండు దిగ్గజ సంస్థలు అలీబాబా, టెన్​సెంట్​ల నుంచి వచ్చినట్లు ఈ నివేదిక వివరించింది.అలీబాబాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఆంట్ ఫినాన్షియల్​ సహా ఇతర సంస్థలు.. ప్రముఖ స్టార్టప్ సంస్థలు  పేటీఎం, స్నాప్​డీల్, బిగ్​బాస్కెట్, జొమాటో వంటి సంస్థల్లో 2.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయి. టెన్​సెంట్ సహా మరిన్ని చైనా సంస్థలు ఓలా, స్విగ్గీ, హైక్, డ్రీమ్​ 11, బైజూస్ వంటి సంస్థల్లో 2.4 బిలియన్​ డాలర్ల వరకు పెట్టుబడిగా పెట్టాయని నివేదిక అంచనా వేసింది.