Asianet News TeluguAsianet News Telugu

యువతే టార్గెట్ బ్యాక్ టు ఫ్రంట్ మూవ్ కెమెరాతో అసుస్ 6జడ్


తైవాన్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ అద్భుతమైన ఫీచర్లతో ఫ్లాగ్ షిప్ ఫోన్ యువతను కేంద్రంగా చేసుకుని భారత విపణిలో విడుదల చేసింది. అసుస్ 6జడ్ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ఈ నెల 23 నుంచి వినియోగదారులకు ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంటుంది.

Asus 6z priced at Rs.31,999, comes with flip camera, SD855, notch-free display
Author
New Delhi, First Published Jun 20, 2019, 11:35 AM IST

న్యూఢిల్లీ: ఇప్పటివరకు బడ్జెట్‌ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు తీసుకొస్తున్న మొబైల్‌ తయారీ కంపెనీలు తాజాగా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లపై కన్నేశాయి. యువతను ఆకట్టుకోవడానికి వేగంతోపాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఆసుస్‌ ‘అసుస్ 6జడ్’ అనే పేరుతో ఓ కొత్త ఫ్లాగషిప్‌ ఫోన్‌ను భారత్‌ విపణిలోకి తీసుకొచ్చింది. 

వాస్తవానికి జెన్‌ఫోన్‌ 6 పేరిట ఇదివరకే ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసిన కంపెనీ ‘జెన్‌ఫోన్‌’ ట్రేడ్‌మార్క్‌ విషయంలో వివాదం నెలకొనడంతో  6జడ్ పేరిట ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? దీని ధర ఎంత? ఒక్కసారి పరిశీలిద్దాం.. 

ఆసుస్‌ 6జడ్ ఫోన్  6జీబీ విత్ 64 జీబీ రామ్ స్టోరేజీ సామర్థ్యం గల వేరియంట్‌ ధరను 31,999గా నిర్ణయించింది. ఇక 6 జీబీ విత్ 128జీబీ రామ్ స్టోరేజీ వేరియంట్‌ ఫోన్ ధర రూ.34,999గా, 8జీబీ విత్ 256 జీబీ రామ్ స్టోరేజీ వేరియంట్‌ ఫోన్ ధర రూ.39,999గా నిర్ణయించింది. 

ఫ్లిప్‌కార్ట్‌లో జూన్‌ 26 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మిడ్‌నైట్‌ బ్లాక్‌, ట్విల్‌ లైట్‌ సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.

అసుస్ 6జడ్ ఫోన్‌తో పాటు ఫోన్‌ బ్యాక్‌ కేస్‌ను కూడా కంపెనీనే అందిస్తోంది. దీంతో పాటు లాంచింగ్‌ ఆఫర్‌ కింద మొబైల్‌ ప్రొటక్షన్‌ ప్లాన్‌ను రూ.99కే అందిస్తోంది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌కు ఈ ప్లాన్‌ దాదాపు రూ.3,999 దాకా ఉంటుంది. ఫోన్‌తో పాటు హెడ్‌ఫోన్స్‌, 18వాట్ల క్విక్‌ ఛార్జర్‌ 4.0ను బాక్స్‌లో అందిస్తారు.

ఆసుస్‌ 6జడ్ ఫోన్ విషయంలో ముందు చెప్పుకోవాల్సింది అందులో అమర్చిన కెమెరా గురించే. ఇది అటు ఫ్రంట్‌ కెమెరా గానూ.. బ్యాక్‌ కెమెరా గానూ పని చేస్తుంది. 48 మెగాపిక్సల్‌ సోనీ IMX 586 సెన్సార్‌తో వస్తోంది. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌ ఉంటుంది. దీంతోపాటు 13 మెగాపిక్సల్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా కూడా ఉంటుంది. ఇందులో సూపర్‌ నైట్‌మోడ్‌ను కంపెనీ అందిస్తోంది. ఒకవేళ ఫోన్‌ ఫ్లిప్‌ ఆన్‌లో ఉండగా చేతి నుంచి ఫోన్‌ చేజారినా విరిగిపోకుండా ఫ్లిప్‌ కెమెరా దానంతట అదే క్లోజ్‌ అవుతుంది.

ఫ్రంట్‌ కెమెరా ఎలాగూ వెనుక భాగంలో ఉంటుంది కాబట్టి డిస్‌ప్లేపై ఎలాంటి నాచ్‌ ఉండదు. మరోవైపు ఫ్లిప్‌ కెమెరా వల్ల పనోరమా ఫొటోలు సులభంగా, చక్కగా తీసుకోవచ్చు. పనోరమా మోడ్‌లోకి వెళ్లగానే కెమెరా ఆటోమేటిక్‌గా మూవ్‌ అవుతూ, సెల్ఫీ మోడ్‌లోకి వచ్చేస్తుంది. 

దీంతో సెల్ఫీ + పనోరమా ఫొటోలు తీసుకోవచ్చు. దీంతోపాటు ఇందులో 480 ఎఫ్‌పీఎస్‌ స్లోమోషన్‌ వీడియో రికార్డింగ్‌, ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలేజేషన్‌తో 4కె వీడియోలు చిత్రీకరించొచ్చు. 

ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ 855 ప్రాసెసర్‌ను వాడారు. 5000 ఎంఏహఎచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌ ఆధారిత జెన్‌ యూఐ6తో ఈ ఫోన్‌ వస్తోంది. తదుపరి క్యూ, ఆర్ ఆండ్రాయిడ్‌ వెర్షన్లు అందుబాటులోకి వచ్చాక అందిస్తామని కంపెనీ పేర్కొంది. 

ఇందులో  19.5:9 యాస్పెక్ట్‌ రేషియోలో 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ +డిస్‌ప్లే వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటక్షన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 2టీబీ వరకు పెంచుకునే వీలుంది. దీంతో పాటు వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉంటుంది. 

గూగుల్‌ అసిస్టెంట్‌, డీఎన్‌డీ, సౌండ్‌ ప్రొఫైల్‌ తదితర ఫీచర్లు ఉపయోగించేందుకు ‘స్మార్ట్‌కీ’ని కంపెనీ అందిస్తోంది. వీటితోపాటు కాల్‌ రికార్డింగ్‌, ట్విన్‌ యాప్స్‌, ఎఫ్‌ఎం రేడియో, యాప్‌లాక్‌, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ వంటి సదుపాయాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యర్థి సంస్థలు వన్ ప్లస్ 7 ప్రో, రెడ్ మీ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ కే 20 ప్రో, గూగుల్ పిక్సెల్ 3ఎ గెలాక్సీ ఎస్ 10ఈ ఫోన్లతో పోటీ పడనున్నది. ఈ ఫోన్లన్నీ అసుస్ 6జడ్ ఫోన్ కంటే ఎక్కువ ధర పలుకుతుండటం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios