Asianet News TeluguAsianet News Telugu

వెహికిల్ చార్జింగ్‌కో యాప్: చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే సబ్సిడీ

విద్యుత్ వాహనాల యజమానులు తమ వెహికల్స్ చార్జింగ్ కోసం ఆన్ లైన్ లో స్లాట్ ఏర్పాటు చేసేందుకు యాప్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం 150 చార్జింగ్ స్టేషన్లు మాత్రమే దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అందుకు రాయితీలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 

App soon for Electric vehicle charging slots
Author
New Delhi, First Published Jun 14, 2019, 12:45 PM IST

న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల యజమానులు తమ వాహనాల చార్జింగ్ చేయించుకుంటేనే నడుస్తాయి. అందుకోసం చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ యా చార్జింగ్ స్టేషన్ల వద్ద చార్జింగ్ కోసం సదరు వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. సదరు మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సన్నాహాలు చేస్తోంది. 

యాప్ ద్వారా విద్యుత్ వెహికల్స్ యజమానులు ఆయా చార్జింగ్ స్టేషన్ల వద్ద సమయాన్ని చెక్ చేసుకుని చార్జింగ్ టైమ్ ఆన్‌లైన్ లోనే బుక్ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ యజమానులు అడ్వాన్స్ రిమోట్ బుకింగ్ ద్వారా చార్జింగ్ స్లాట్స్ చేసుకోవచ్చు.

ఈ మొబైల్ అప్లికేషన్ సదరు చార్జింగ్ స్టేషన్ లొకేషన్, దాని టైప్, చార్జర్ల సంఖ్యను కూడా తెలియజేస్తోంది. అలాగే ఒక్కో విద్యుత్ వెహికిల్‌కు కేటాయించే సమయాన్ని విశదపరుస్తుందని పేరు చెప్పడానికి విద్యుత్ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను గురించి తెలుసుకోవచ్చు. ఈ చార్జింగ్ స్టేషన్ల వివరాల డేటా కేంద్ర విద్యుత్ శాఖ ప్రణాళికా వింగ్ రూపొందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తే భారీ సబ్సిడీ
ప్రధాన నగరాలు, జాతీయ రహదారులపై విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా 5000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆయా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇచ్చే సబ్సిడీ విధానాన్ని త్వరలో కేంద్రం ప్రకటించనున్నది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఈ చార్జింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసే వెసులుబాటు కనిపిస్తోంది. 

ఆయా రాష్ట్రాల పరిధిలో సబ్సిడీ పొందేందుకు విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల యజమానులు రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాల పరిధిలోని విద్యుత్ పంపిణీ సంస్థలను నోడల్ ఏజెన్సీలుగా ప్రతిపాదించే చాన్స్ కనిపిస్తున్నది. జాతీయ రహదారులపై ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లకు 100 శాతం సబ్సిడీ అందనున్నది. ఏబీబీ, ఏసీఎంఈ, ఫోరం ఇండియాతోపాటు పలు డచ్ సంస్థలు, ఎన్టీపీసీ, గెయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios