ప్రత్యేకతలు


వన్ ప్లస్ 6, మెరిసే బ్లూ కలర్
6.28 అంగుళాల ఫుల్ హెచ్ డి + ఎఎమ్ఒ ఎల్‌ఈడీ డిస్‌ప్లే
వెనుకవైపు 20 ఎంపీ, 16 ఎంపీ సెన్సర్ కెమెరాలు
ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా.
గ్లాస్ బ్యాక్ డిజైన్,  వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్
2.4 జిహెచ్‌జి ఆక్టా క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్ సెట్, 
8 జిబి ర్యామ్,
256 జిబి స్టోరేజ్
6 జిబి ర్యామ్, 64, 128 జీబీ స్టోరేజ్‌తో బడ్జెట్‌ ఫోన్ వెర్షన్లలో కూడా అందుబాటులోకి రావచ్చు
3,300 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ కెపాసిటీ
ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ
ఆండ్రాయిడ్ 8.1 ఒరెయు బేస్డ్ ఆక్సిజెన్ ఓఎస్
వెల. 64 జీబీ వెర్షన్ రూ. 36,999
128 జీబీ వెర్షన్ రూ. 39,999

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్‌మితో సహా అన్ని బ్రాండ్‌లకు నిజమైన పోటీనిస్తూ ప్రథమ స్థానం చేరుకునేందుకు అహర్నిశలూ ప్రయత్నిస్తున్న వన్ ప్లస్ మొబైల్ కంపెనీ తన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ సంచలనాత్మక విజయం సాధించింది. ఆండ్రాయిడ్ పి వెర్షన్ ఓఎస్ ‌ని వినియోగించనున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా వన్ ప్లస్ రికార్డు సృష్టించనుంది. ఆ ఆండ్రాయిడ్ పి ఓఎస్ ఇంకా బీటా ఫామ్ లోనే ఉండటం మరీ విశేషం. 

ఉత్తమమైన బ్రాండ్‌గా తననుతాను మెరుగుపర్చుకునేందుకు స్థిరంగా శ్రమిస్తున్న వన్ ప్లస్ కస్టమర్లకు చేసిన హామీలను నెరవేర్చుకోవడంలో అన్నిటికంటే  ముందు ఉంటోంది. ఇటీవలి కాలంలో అది చేసిన అతిపెద్ద హామీ ఏదంటే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వైపు మారడమే. 

గూగుల్ సంస్థ ఇప్పుడు ఆండ్రాయిడ్ పి సెకెండ్ డెవలపర్ ప్రివ్యూను గూగుల్ ఐఓ సదస్సులో ప్రదర్శించింది. వన్ ప్లస్ 6 వినియోగదార్లకు తాను ఆండ్రాయిడ్ పి బీటా వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ చేసిన ప్రకటన వన్ ప్లస్ కస్టమర్లను ఉర్రూతలూగించింది. అంటే గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌పై ఏరకంగానూ ఆధారపడకుండానే ఆండ్రాయిడ్ పి బీటా వెర్షన్‌ను వన్ ప్లస్ వినియోగదారులు నేరుగా అస్వాదించవచ్చు.

మా కమ్యూనిటీపై విశ్వాసం చూపటం ద్వారా మా వినియోగదారులు వేగవంతమైన, మృదువైన, స్వచ్ఛమైన యూజర్ అనుభవాన్ని కోరుకుంటున్నారని మేం తెలుసుకున్నాం. దీన్ని మేం బర్డెన్ లెస్ అని పిలుస్తున్నాం. అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ని తయారు చేయడంతోపాటుగా స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని బ్లాట్ వేర్ మరియు అనవసర ప్రకటనలకు తావులేకుండా యూజర్లకు మరింత విలువను కల్పించడానికి కృషి చేస్తున్నాం అని వన్ ప్లస్ సీఈఓ పెటె లావ్ పేర్కొన్నారు.