Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్: 20వేల 5జీ ఫోన్‌ రూ. 1249కే.. ఈ విధంగా మీకు డిస్కౌంట్ లభిస్తుంది..

అమెజాన్ గ్రేడ్ రిపబ్లిక్ డే సేల్ 2023లో రెడ్‌మి నోట్ 12 5జి 10 శాతం తగ్గింపుతో రూ. 17,999కి లిస్ట్ చేయబడింది. ఈ ధర వద్ద మీకు 4జి‌బి  ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. ఫోన్ కొనుగోలుపై నెలకు రూ. 860 సులభ EMI ఇంకా ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. 

Amazon Sale: Opportunity to buy Redmi 5G phone worth Rs 19,999 for Rs 1249-sak
Author
First Published Jan 17, 2023, 4:12 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. జనవరి 20 వరకు జరిగే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023లో స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప ఆఫర్‌లు అందిస్తుంది. అయితే ఈ అమెజాన్ సేల్‌లో రూ. 19,999 విలువైన రెడ్‌మి నోట్ 12 5జి ఫోన్‌ను కేవలం రూ. 1249కే కొనుగోలు చేయవచ్చు. రూ.2,000 తగ్గింపుతో రూ.17,999కి సైట్‌లో ఫోన్ లిస్ట్ చేయబడింది. మీరు మంచి 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు ఇంకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతో చాలా తక్కువ ధరలో రెడ్‌మి నోట్ 12 5జిని మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్ పై ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం...

రెడ్‌మి నోట్ 12 5Gపై ఆఫర్లు
అమెజాన్ గ్రేడ్ రిపబ్లిక్ డే సేల్ 2023లో రెడ్‌మి నోట్ 12 5జి 10 శాతం తగ్గింపుతో రూ. 17,999కి లిస్ట్ చేయబడింది. ఈ ధర వద్ద మీకు 4జి‌బి  ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. ఫోన్ కొనుగోలుపై నెలకు రూ. 860 సులభ EMI ఇంకా ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఫోన్‌తో పాటు బ్యాంక్ ఆఫర్‌లలో SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం (రూ. 1250 వరకు) ఇన్స్టంట్ తగ్గింపు కూడా ఉంటుంది.

ఇది మాత్రమే కాదు, కంపెనీ రెడ్‌మి నోట్ 12 5G కొనుగోలుపై రూ. 16,750 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అంటే మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.16,750 వరకు ఆదా చేసుకోవచ్చు. అన్ని ఆఫర్‌లు ఇంకా ఎక్స్ఛేంజ్ తో మీరు  రెడ్‌మి నోట్ 12 5Gని రూ.1,249కే పొందవచ్చు. 

 రెడ్‌మి నోట్ 12 5G ఫీచర్లు
 రెడ్‌మి నోట్ 12 5G ఆండ్రాయిడ్ 12తో MIUI 13తో వస్తుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లే పై గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఇంకా స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్‌తో 8జి‌బి ర్యామ్, గ్రాఫిక్స్ కోసం Adreno 619 GPU, 128జి‌బి స్టోరేజ్‌  పొందుతుంది.

 రెడ్‌మి నోట్ 12 5Gలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 48-మెగాపిక్సెల్ కెమెరా. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ ఇంకా మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, ఫోన్‌తో పాటు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ లో 5,000mAh బ్యాటరీ ఉంది, ఇంకా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios