ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ మరోమారు ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌ ముందుగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అందుబాటులోకి రానుంది.

జూలై 16న మధ్యాహ్నం 12 గంటలకు ప్రైమ్ డే సేల్ మొదలై 18న అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా వివిధ రకాలైన ఆరు ప్లాష్ సేల్స్ కూడా నిర్వహించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు, ఈఎంఐ, అమెజాన్ పే లావాదేవీలపై రూ.10 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.
 
ప్రేమ్ డే సేల్‌లో భాగంగా భారత్‌లో తొలిసారి 200 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. వన్‌ప్లస్, సెన్హీసర్, డబ్ల్యూడీ, గోద్రెజ్, క్లౌడ్‌వాకర్, సీగేట్, శాంసంగ్ తదితర సంస్థల ఉత్పత్తులు కూడా ఇందులో ఉండనున్నాయి. హోం, కిచెన్, డైలీ నీడ్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ తదితర కేటగిరీలు ఉత్పత్తులను కూడా విక్రయానికి ఉంచనుంది. యాప్-ఓన్లీ కాంటెస్ట్ కూడా నిర్వహించనుంది. ఇందులో గెలిచిన యూజర్లకు వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది.