ముంబై : ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన సైట్‌లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించింది. బుధవారం ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనుంది. దీనికి  ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ప్రధానంగా శాంసంగ్‌, షియోమీ, రియల్‌మీ, ఆపిల్‌ వారి ఐఫోన్లు, వన్‌ప్లస్‌ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయచ్చు. 

ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.3వేల తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే  రెడ్‌మీ కే2 ప్రొ తోపాటు, ఐఫోన్‌ 11 ప్రొ, ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలకు అమెజాన్  అందిస్తోంది ‌.

వన్‌ప్లస్ 7 టీ (8 జీబీ, 128 జీబీ) అసలు ధర రూ.37,999 కాగా, తగ్గింపుపై రూ. 34,999లకే విక్రయిస్తున్నారు. ఇంకా అదనంగా రూ.8,850 వరకు అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.స

ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫోన్ అసలు ధర రూ.55,990కాగా, రూ.  32,990లకు విక్రయిస్తున్నారు. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ ఫోన్ అసలు ధర కంటే రూ.10 వేలు తగ్గించి రూ.42,999లకే విక్రయిస్తున్నారు. దీని అసలు ధర  52,999గా నిర్ణయించారు.

Also read:నో డౌట్: రూ.2000 కనుమరుగే.. బట్ అదేంలేదన్న ‘నిర్మల’మ్మ

వన్‌ప్లస్ 7 ప్రో (నెబ్యులా బ్లూ 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌) ఫోన్ ధర 18శాతం తగ్గింపుపై రూ. 42,999లకే లభిస్తోంది. ఇంకా 
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ర్యామ్ స్టోరేజ్ సామర్థ్యం గల ఫోన్‌ను రూ.5000 తగ్గించి రూ. 11,999కు అందుబాటులో ఉంచారు. దీని అసలు ధర  రూ. 16,490. 

కాగా, రెడ్ మీ కే 20, రెడ్ మీ కే 20 ప్రో ఫోన్లను కొనుగోలు చేసే వారికి సాధారణం కంటే రూ.3000 అదనపు ఎక్స్చేంజ్ విలువను ఈ సేల్‌లో పొందొచ్చు. హానర్ 20 మోడల్ 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.35,999 కాగా, 22,999లకు లభిస్తోంది. వివో వీ 17 ప్రో ఫోన్ ధర రూ.32,990 కాగా, ఐదు వేల డిస్కౌంట్ పై వినియోగదారులకు అందుబాటులో ఉంది.