Asianet News TeluguAsianet News Telugu

90 నుంచి 900 డాలర్లకే కాస్ట్‌లీ కెమెరాలు.. అమెజాన్ బిగ్ మిస్టేక్


గ్లోబల్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ తన ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా వెబ్ సైట్‌లో చేసిన చిన్నపొరపాటు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. 13 వేల డాలర్ల ఫోన్ 94 డాలర్లకు, 10 వేల డాలర్ల కెమెరాను 900 డాలర్లకే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది అమెజాన్.

Amazon Accidentally Sold $13,000+ Camera Gear for $100 on Prime Day
Author
New Delhi, First Published Jul 20, 2019, 4:38 PM IST

న్యూఢిల్లీ: గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఘోర తప్పిదం చేసి లక్షలాది రూపాయలు నష్టపోయింది. చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకున్నది. మరోవైపు వినియోగదారులు మాత్రం సంబురాలు చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రైమ్ డే సేల్‌లో ఈ తప్పిదం జరిగింది. 

అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్‌లో భాగంగా ఇతర ఉత్పత్తులతోపాటు హై ఎండ్ కెమెరాలపైనా బండిల్ డీల్స్ ప్రకటించింది. అలాగే ‘సోనీ ఎ 6000 మిర్రర్ లెస్ కెమెరా’పై ఆఫర్లు ప్రకటించింది. 

16-50 మిల్లీ మీటర్ లెన్స్‌తో బండిల్‌గా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన ఈ కెమెరాను 94.48 డాలర్ల (రూ.6,500)కు అమ్మకానికి పెట్టేసింది. దీంతో అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. 

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని అమెజాన్ లబోదిబోమంది. వాటిని కొనుగోలు చేసిన వినియోగదారులు మాత్రం సంతోషంతో సంబురాలు చేసుకున్నారు. 

ఎందుకంటే ఆ కెమెరా అసలు ధర 5500 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4 లక్షలు. అలాగే, 13వేల డాలర్లు (రూ.9 లక్షలు) విలువైన మరో కెమెరాతోపాటు రూ.1.37 లక్షల విలువైన కెనాన్ కెమెరాను కూడా రూ.6.500 వేలకే అమ్మేసింది.
 
వెబ్ సైట్ డీల్స్‌లో కెమెరా ధరను పొరపాటున ఒక సున్నా తగ్గించేసి 550 డాలర్లుగా చూపిన అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా 94.48 డాలర్లకే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇదేదో బాగుందని భావించిన కస్టమర్లు ఎంచక్కా కొనేసుకుని పండుగ చేసుకున్నారు.

తీరా కొనుగోలు చేశాక కస్టమర్లు సోషల్ మీడియా వేదికలపై తమ సంతోషాన్ని పంచుకున్న తర్వాత గానీ అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైమ్ మెంబర్  తాను 10 వేల డాలర్ల విలువైన కెమెరాను 900 డాలర్లకే కొనుగోలు చేశానని చెప్పుకున్నాడు. 

మరో యూజర్ 13 వేల డాలర్ల విలువైన సోనీ కెమెరాను 94 డాలర్లకే కొనుగోలు చేశానని గొప్పలు చెప్పుకున్నాడు. పొరపాటును ఆలస్యంగా గుర్తించిన అమెజాన్ ఆ తర్వాత ఆర్డర్లను రద్దు చేసినట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios