Asianet News TeluguAsianet News Telugu

సై అంటే సై: జియోకు ధీటుగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్

భారత టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యాయి. నేరుగా 4జీతో రావడంతో డేటా ఉచితం వంటి ఆఫర్లతో జియో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నది. కానీ దీనికి ప్రతిగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. కాకపోతే ఈ రెండు సంస్థల నెట్‌వర్క్‌లు పూర్తిగా 4జీ పరిధిలోకి మారడమే ప్రధాన సవాల్ కానున్నది. 

Airtel, Vodafone Idea offer sops to take on Jio in ruralmarkets
Author
New Delhi, First Published Apr 4, 2019, 11:02 AM IST

న్యూఢిల్లీ: ‘4జీ’ ఫీచర్ ఫోన్‌తో రిలయన్స్ జియో విసిరిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి సంస్థలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు వ్యూహం రూపొందించాయి. కోల్పోయిన కస్టమర్లను తిరిగి కూడగట్టేందుకు గ్రామీణ మార్కెట్లపై కేంద్రీకరించాయి. రమారమీ మరో 35 కోట్ల మంది ఖాతాదారులను తమ తమ ఖాతాల్లో చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి.

ఇందుకు మెట్రో నగరాల పరిధిలో తలెత్తిన పోటీని తట్టుకునేందుకు రిటైలర్లకు టెలికం ప్రొవైడర్లు జ్యూసీ ఇన్సెంటివ్‌లు అందజేస్తున్నాయి. అధిక మొత్తంలో రీచార్జి, డేటా కస్టమర్ యాక్టివేషన్ గరిష్ఠంగా చేసిన వారికి రూ.7000 - రూ.8000 మేరకు క్యాష్ పే ఔట్స్, భారీ ఆఫర్లు చూపుతున్నాయి. 

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇప్పటి వరకు మెట్రో నగరాలు మొదలు చిన్న పట్టణాలు, గ్రామాల వరకు పట్టు సాధించేందుకు అనుసరించిన వ్యూహం అమలులో ఏమాత్రం వెనుకడుగు వేసేందుకు సిద్ధంగా లేదు. 

4జీ సేవలను మరింత వేగంగా విస్తరించేందుకు తన నెట్ వర్క్ విస్తరించేందుకే ప్రాధాన్యం ఇస్తుందని రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. మరో అడుగు ముందుకేసి కంపెనీ యాజమాన్యంలోని రిటైల్ కం సర్వీస్ పాయింట్లుగా మార్చుకుని గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు రిలయన్స్ తన మార్కెట్ ను కన్సాలిడేట్ చేసుకోవాలని తలపోస్తున్నది.

 ప్రస్తుతం గల ఏడు వేల రూరల్ రిటైల్ పాయింట్లను 10 వేలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిపై స్పందించేందుకు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా అందుబాటులోకి రాలేదు. రిలయన్స్ జియో ద్వారా 4జీ సేవలందించడంతో రోజురోజుకు యూజర్ల సంఖ్యను పెంచుకుంటున్నది. తద్వారా చౌకగా సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

రిలయన్స్ జియో చర్య వల్ల ఎయిర్ టెల్ రూరల్ బేస్ అక్టోబర్ నెలలో 170 మిలియన్లు ఉంటే అది జనవరి కల్లా 163.12 మిలియన్లకు పడిపోయింది. వొడాఫోన్ ఐడియా కూడా 225 మిలియన్ల నుంచి 218.67 మిలియన్లకు పతనమైంది. 

ఇదే సమయంలో రిలయన్స్ జియో రూరల్ సబ్ స్క్రిప్షన్ 87.22 మిలియన్ల నుంచి 107 మిలియన్లకు చేరుకున్నది. ఎయిర్ టెల్ రెవెన్యూ మార్కెట్ షేర్ పడిపోతోంది. రిలయన్స్ జియో 29.7 శాతం రెవెన్యూ మార్కెట్ షేర్ పెరిగింది. ఎయిర్ టెల్ రెవెన్యూ మార్కెట్ షేర్ 30 శాతం , వొడాఫోన్ ఐడియా 31.4 శాతం వద్ద స్థిర పడ్డాయి. 

ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తమ రిటైలర్ల మార్జిన్లను 2.25 నుంచి 10 శాతానికి పెంచేశాయి. ఉదాహరణకు రూ.199 నుంచి రూ.449 రీ చార్జింగ్ కూపన్ల విక్రయంపై రిటైలర్లు ఆరు శాతం నుంచి 10 శాతం మార్జిన్లు పొందుతారు. రూ.35 విలువైన కూపన్లపై 2.25 శాతం బేస్ మార్జిన్లు వస్తాయి. 

ఇంకా విడిగా భారతీ ఎయిర్‌టెల్ సెలెక్టెడ్ రిటైల్ పాయింట్ల వద్ద థర్డ్ పార్టీ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంటోంది. బ్రాండ్ ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక డేటా ప్యాక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. అయితే జియోను ఢీ కొట్టాలంటే ముందు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ముందుగా తమ నెట్‌వర్క్‌లను 4జీ పరిధిలోకి తేవడమే ప్రధాన సవాల్ కానున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios