Asianet News TeluguAsianet News Telugu

15 ఏళ్ల బంధం: ఇంటెల్‌‌కు త్వరలో ‌ఆపిల్ రాంరాం?

టెక్‌ దిగ్గజాలు ఇంటెల్‌, ఆపిల్‌ ప్రపంచానికి సంయుక్తంగా పలు కొత్త ఆవిష్కరణలు అందించాయి. ప్రస్తుతం కంప్యూటర్‌ తయారు చేయడంలో ఆపిల్‌ సంస్థ ఇంటెల్‌ మైక్రోప్రాసెసర్‌లను ఉపయోగిస్తుంది. అదే విధంగా ఆపిల్‌ సంస్థ అత్యాధునిక చిప్‌లను రూపొందిస్తుంది. 

After 15 years, Apple prepares to break up with Intel
Author
New Delhi, First Published Jun 21, 2020, 12:49 PM IST

ముంబై: టెక్‌ దిగ్గజాలు ఇంటెల్‌, ఆపిల్‌ ప్రపంచానికి సంయుక్తంగా పలు కొత్త ఆవిష్కరణలు అందించాయి. ప్రస్తుతం కంప్యూటర్‌ తయారు చేయడంలో ఆపిల్‌ సంస్థ ఇంటెల్‌ మైక్రోప్రాసెసర్‌లను ఉపయోగిస్తుంది. అదే విధంగా ఆపిల్‌ సంస్థ అత్యాధునిక చిప్‌లను రూపొందిస్తుంది. 

సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్‌ దిగ్గజ సంస్థ ఇన్‌టెల్‌తో విడిపోవాలని ఆపిల్‌ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్‌ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. 

ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫీచర్లతో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లను (ఐ-ఫోన్‌) రూపొందించి కోట్ల మంది వినియోగదారులను ఆపిల్‌ ఆకట్టుకుంది. ‌కానీ ఆపిల్‌ సంస్థ సొంతంగా నిలదొక్కుకునే వ్యూహాలు రచిస్తున్నది.

ఇటీవల ట్రక్కుల తయారీకిలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రవేశించిన విషయం విదితమే. మరోవైపు అన్ని దేశాల టెక్నాలజీలను ఉపయోగించుకొని సరికొత్త ఆవిష్కరణలకు ఆపిల్‌ సంస్థ వ్యూహాలు రచిస్తుంది.

ఆపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ ఐఫోన్లకు సరికొత్త చిప్‌ల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. మరోవైపు అత్యాధునిక టెక్నాలజీతో దిగ్గజ కంపెనీలు సొంతంగా ఎదగాలనే వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఇటీవల ఫ్లోరిడా, ఆరిజోనా, ఉత్తర, దక్షిణ కరోలినాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాలలో స్టోర్లను మూసివేస్తున్నట్లు ఐఫోన్ల దిగ్గజం ఆపిల్‌ ఇంక్‌ పేర్కొంది. దీంతో స్టాక్ మార్కెట్లలో ఆపిల్‌ షేర్ స్వల్పంగా 0.5 శాతం నీరసించింది.

ఏటా ఆపిల్ సంస్థకు మైక్రో చిప్స్ విక్రయించగా ఏటా ఇంటెల్ 3.4 బిలియన్ల డాలర్లు గడిస్తోంది. మరోవైపు ఆపిల్ ఏటా రెండు కోట్ల మాక్స్ విక్రయిస్తోంది. ప్రతి పర్సనల్ కంప్యూటర్ కోసం ఇంటెల్ చిప్ సరఫరా చేస్తోంది. 

రెండు సంస్థలు విడిపోనున్నాయన్న వార్తలపై ఆపిల్, ఇంటెల్ స్పందించడానికి నిరాకరించాయి. ఆపిల్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్ దిగ్గజంగా ఎదుగాలని ఆకాంక్షిస్తూ.. ఇంటెల్‌కు బ్రేకప్ చెప్పాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

ఆపిల్ ‘తైవాన్’ సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ పార్టనర్ కూడా ఐపాడ్స్, ఐఫోన్ల కోసం విడి భాగాలను తయారుచేసింది. ఆసియా ఖండంలో మాక్స్ చిప్స్ తయారు చేస్తుంని భావిస్తున్నారు. ఐ-ఫోన్లలో ప్రాసెసర్ల వినియోగం కోసం ఫాక్స్ కాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదని సమాచారం. 

అమెరికాలోని సెమీ కండక్టర్ బిజినెస్‌లో ఇంటెల్ స్టాండర్డ్ బేరర్‌గా ఉంది. పవర్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్లు, కార్లు, కన్జూమర్ డివైజెస్‌లలో వీటిని వాడతారు. రెండు సంస్థల బ్రేకప్ ప్రభావం ఇంటెల్ మీద స్వల్ప కాలికంగానైనా ఆర్థికంగా చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios