Asianet News TeluguAsianet News Telugu

ఫోన్‌పే యాప్ కొత్త ఫీచర్... కాష్ విత్ డ్రా కూడా చేసుకోవచ్చు...

ఫోన్‌పే యాప్ ఉపయోగించే యూజర్లు ఈ పైలట్ ఫీచర్ ద్వారా ఏదైనా వ్యాపారి షాపు నుండి రోజుకు 1,000 రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనిని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 

phonepe app launches new cash withdraw feature from shops
Author
Hyderabad, First Published Jan 24, 2020, 4:19 PM IST

డిజిటల్ పే మెంట్  ప్లాట్‌ఫామ్ ఫోన్‌ పే యాప్ గురువారం తన ప్లాట్‌ఫామ్‌లో 'ఫోన్‌ పే ఎటిఎం' అనే ప్రత్యేక కొత్త ఫీచర్ని లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా ఫోన్ పే యాప్ యూజర్ డబ్బు అవసరం ఉంటే విఫోన్‌ పే ఎటిఎం సదుపాయాన్ని అందించే వ్యాపారుల నుండి తక్షణ డబ్బు పొందవచ్చు.

also read సామ్‌సంగ్ నుండి పెరుగును తయారు చేసే ఫ్రిజ్‌... ఎలా అంటే ?

నగదు అవసరం ఉన్న కస్టమర్ ఫోన్‌ పే యాప్ ఓపెన్ చేసి 'స్టోర్స్' టాబ్‌కు వెళ్లి 'ఫోన్‌ పే ఎటిఎం' సింబల్ పై క్లిక్ చేసి, ఈ సదుపాయాన్ని అందించే సమీప షాపులను ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఒక వినియోగదారుడు  పైలట్ ఫీచర్ ద్వారా వ్యాపారి నుండి రోజుకు రూ.1,000 పొందవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో మాత్రమే ప్రారంభించారు.

phonepe app launches new cash withdraw feature from shops

ఫోన్‌ పే ఎటిఎం సదుపాయాన్ని అందించే షాపుకు వెళ్లి "విత్ డ్రా" బటన్‌పై క్లిక్ చేసి, ఫోన్‌ పే యాప్ ద్వారా అవసరమైన మొత్తాన్ని "ఫోన్‌ పే ఎటిఎం" సదుపాయాన్ని అందించే వ్యాపారికి బదిలీ చేయండి.  బదిలీ చేసిన తర్వాత, వ్యాపారి వినియోగదారునికి బదిలీ చేసిన మొత్తానికి  నగదును(డబ్బు) ఇస్తారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

also read ఫోటోగ్రఫి కోసం కెనాన్‌ నుండి కొత్త 5.5కె కెమెరా...ధర ఎంతంటే ?

"ఫోన్‌పే ఎటిఎం" వినియోగదారులను మా నమ్మకమైన వ్యాపార భాగస్వాముల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగదు ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తుంది.వ్యాపారులువారి డబ్బును  జమ చేసుకోవడం లేదా అదనపు నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ప్రతిసారి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇది సహాయపడుతుంది ”అని ఫోన్‌పే ఆఫ్‌లైన్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ వివేక్ లోహ్చెబ్ అన్నారు.

ఈ సర్విస్ పొందటానికి వినియోగదారులకు లేదా వ్యాపారులకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. వినియోగదారుల విత్ డ్రా లిమిట్ ఆయా బ్యాంకులు నిర్ణయించిన పరిమితికి సమానంగా ఉంటుంది.ఈ సదుపాయం బ్యాంకు ఎటిఎంలు లేని  ప్రదేశలో లేదా ఎటిఎం నుండి కాష్ పొందలేని కస్టమర్ల కోసం పక్కనే ఉండే షాపులు, దుకాణాలు ఎటిఎంలుగా పనిచేయడానికి సహకరిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios