Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్... ఉచితంగా టీవీ...

గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ఎయిర్‌టెల్, క్యూరియాసిటీ స్ట్రీమ్‌ల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని మరింత కొనసాగించేందుకు ప్రీమియం కంటెంట్‌ను అందిస్తున్నారు.

Airtel Digital TV Launches CuriosityStream Channel for free
Author
Hyderabad, First Published Apr 4, 2020, 10:47 AM IST

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యూజర్లు ఇప్పుడు మొదటిసారిగా క్యూరియాసిటీ స్ట్రీమ్ నుండి ప్రీమియం కంటెంట్‌ను వీక్షించవచ్చు. క్యూరియాసిటీ స్ట్రీమ్ నుండి డాక్యుమెంటరీ సినిమాలు,వెబ్ సిరీస్ చూడవచ్చు.

గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ఎయిర్‌టెల్, క్యూరియాసిటీ స్ట్రీమ్‌ల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని మరింత కొనసాగించేందుకు ప్రీమియం కంటెంట్‌ను అందిస్తున్నారు.

క్యూరియాసిటీ స్ట్రీమ్ టీవీ ఛానెల్ ఎయిర్‌టెల్‌కు ప్రత్యేకమైనది అలాగే ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యుజర్లకు అదనపు ఖర్చు లేకుండా అందిస్తున్నారు. క్యూరియాసిటీ స్ట్రీమ్ ఫుల్ కంటెంట్ లైబ్రరీతో వస్తుంది, ఇందులో స్టీఫెన్ హాకింగ్ ఇష్టమైన ప్రదేశాలు సంబంధించిన కంటెంట్ కూడా ఉంది.

క్యూరియాసిటీ స్ట్రీమ్ అందించే  కంటెంట్‌ ఎయిర్‌టెల్ ఛానెల్‌లలో ప్రత్యేకంగా ఉచితంగా అందిస్తున్నారు.


"క్యూరియాసిటీ స్ట్రీమ్ ప్రేక్షకులకు వారి అభిరుచులకు అనుగుణంగా వేలాది చిత్రాలను, వెబ్ సిరీస్లను, ట్రావెల్, ఆర్ట్స్, హిస్టరీ, కార్లు, ఆర్కిటెక్చర్ ఇంకా మరెన్నో కొత్త కంటెంట్ చూడటానికి అనుమతిస్తుంది" అని పత్రికా ప్రకటన ద్వారా పేర్కొంది.

also read వివో నుంచి 5జీ ఫోన్ ఎస్6.. ధరెంతంటే? 4 నుంచి విక్రయాలు షురూ


ఎయిర్‌టెల్ డిజిటల్ టివి 16.5 మిలియన్లకు పైగా వినియోగదారులకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది, వారు తమ సెట్-టాప్ బాక్స్‌లో ఛానల్ నంబర్ 419 లో వీటిని చూడవచ్చు.


క్యూరియాసిటీ స్ట్రీమ్‌ను మొదట ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ఇంకా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో ప్రారంభించారు. ఆ ప్లాట్‌ఫామ్‌లపై క్యూరియాసిటీ స్ట్రీమ్ విజయవంతం కావడంతో, ఈ  సర్వీస్ ఎయిర్‌టెల్ డిజిటల్ టివిలో ప్రారంభించారు.


క్యూరియాసిటీ స్ట్రీమ్ అనేది డిస్కవరీ ఛానల్ వ్యవస్థాపకుడు జాన్ ఎస్. హెండ్రిక్స్ ప్రారంభించిన స్ట్రీమింగ్ సర్వీస్. ఇది మొట్టమొదట 2015 లో నాన్-ఫిక్షన్ ఇంకా ఫ్యాక్చువల్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైంది.

నెలకు $ 3 (సుమారు రూ. 220), హై-డెఫినిషన్ కోసం నెలకు $ 6 (సుమారు రూ. 450) చెల్లించాల్సి ఉంటుంది. 4కె ప్లాన్ కోసం నెలకు $ 9 (సుమారు రూ. 680) చెల్లించాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios