ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కి టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చురకలు అంటించాడు.  పీటర్సన్ సైలెంట్ గా ఉన్నావేంటి..? అంతా ఒకేనా అంటూ ట్వీట్ చేశాడు. ఈ చురకలు ఏదైనా క్రికెట్ మ్యాచ్ గురించి అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే... యూవీ చేసిన ఈ కామెంట్స్ ఒక ఫుట్ బాల్ మ్యాచ్ కోసం.

ఇంతకీ మ్యాటరేంటంటే...  ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ -చెల్సీ జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 4-0 తేడాతో చెల్సీపై విజయం సాధించింది. దాంతో మాంచెస్టర్ జట్టుకు వీరాభిమాని అయిన యూవీ చెల్సీ జట్టుకి అభిమాని అయిన కెవిన్ పీటర్సన్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. పీటర్సన్ సైలెంట్ గా ఉన్నావేంటి..? అంతా ఒకేనా అంటూ ట్వీట్ చేశాడు.  పక్కన నవ్వుతున్న ఎమోజీని కూడా జత చేశాడు.

ఫుట్ బాల్ విషయంలో వీరిద్దరూ గతంలో ట్విట్టర్ లో మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టును ఉద్దేశించి పీటర్సన్ చేసిన ట్వీట్ కు యూవీ కూడా ధీటుగా స్పందించాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ తోపాటు ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్ లో పాల్గొన్నాడు.