టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి మాత్రమే కాదు... ఫిట్ నెస్ కి కూడా అభిమానులు ఉన్నారు. ఆటలో ఎంత బిజీగా ఉన్నా... ఆయన తన ఫిట్ నెస్ ని మాత్రం పక్కన పెట్టేవాడు కాదు. సిక్స్ ప్యాక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అప్పుడప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా బుమ్రా తో కలిసి సిక్స్ ప్యాక్ షో చేశాడు. ఆ ఫోటోకి అభిమానులతోపాటు... మాజీ క్రికెటర్ యువరాజ్ కూడా స్పందించాడు. 

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రస్తుతం టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. టీ 20 సిరీస్, వన్డే సిరీస్ లను ఇప్పటికే టీం ఇండియా కైవసం చేసుకుంది. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ కోసం రెడీ అవుతుంది. ఈ సీరిస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆ మధ్యలో దొరికిన ఖాళీ సమయంలో  ఆటగాళ్లంతా బీచ్ లో సందడి చేశారు. 

కాగా...విరాట్ కోహ్లీతో కలిసి సిక్స్ ప్యాక్ ఫోజిచ్చిన ఫోటోను బుమ్రా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. కాగా యూవీ కూడా సరదగా స్పందించాడు. ‘ ఓహ్ ఫిటెనెస్ ఐడల్’ అంటూ ప్రశంలు కురిపించాడు. గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లీ, బుమ్రాలు తమ ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. తమ సహచర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.