Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించిన అన్షూ మాలిక్... వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కి...

వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు క్రియేట్ చేసిన 19 ఏళ్ల అన్షూ మాలిక్... 59 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సరితా మోర్‌కి కాంస్యం... 

World wrestling Championships: ANSHU creates history with SILVER, Sarita won bronze
Author
India, First Published Oct 7, 2021, 11:36 PM IST

నార్వేలోని ఓస్లోలో జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్ అన్షూ మాలిక్ చరిత్ర క్రియేట్ చేసింది. 57 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన అన్షూ మాలిక్, తుదిపోరులో 2016 ఒలింపిక్ ఛాంపియన్, 2020 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హెలెన్ లూసీ మరోలీ చేతుల్లో 4-1 ఓడి, రజతంతో సరిపెట్టుకుంది...

అయితే వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు క్రియేట్ చేసింది 19 ఏళ్ల అన్షూ మాలిక్... బౌట్ ఆరంభంతో తొలి పాయింట్ సాధించి మరోలీపై ఆధిక్యం సాధించింది అన్షూ. అయితే భారత యంగ్ రెజ్లర్‌పై ఎదురుదాడి చేసిన మరోలీ, అన్షూని ఒడిసిపట్టి ఆమె కుడిచేతికి గాయం చేసి మరీ విజయాన్ని అందుకుంది. 

59 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సరితా మోర్, కాంస్య పతక పోరులో స్వీడెన్‌కి చెందిన లిండ్‌బర్గ్‌ను 8-2 తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన ఐదో భారత మహిళాగా నిలిచింది సరితా... ఇంతకుముందు 2012లో గీతా ఫోగట్, బబితా ఫోగట్, 2018లో పూజా దండా, 2019లో పూజా ఫోగట్ కాంస్య పతకాలు సాధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios