టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కి కొంచెం కూడా రెస్ట్ లేదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశాడు. మొన్ననే ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఈ నెలాఖరుకి మళ్లీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే... ఈ క్రమంలో ఆటగాళ్లను కాస్త విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ తెలిపింది. రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీలు తమ కుటుంబాలతో సేద తీరుతున్నారు కూడా. కానీ హార్దిక్ మాత్రం చెమటలు చిందిస్తున్నాడు.

జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రపంచ కప్‌ ముందుండటం వల్ల ఎలాంటి విశ్రాంతి తీసుకోవట్లేదని పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాండ్యను ప్రశంసిస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లందరూ విహార యాత్రల్లో ఉంటే పాండ్య మాత్రం ఇలా ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.