Asianet News TeluguAsianet News Telugu

Viral Video: అమ్మ ఆస్పత్రిలో.. రోజు రాత్రి పదికిలోమీటర్ల పరుగు.. ఈ కుర్రాడి తపనకు సలాం కొట్టాల్సిందే.

Pradeep Mehra Running 10 kms Every Night: ఆ కుర్రాడికి 19 ఏండ్లు. తల్లిదండ్రులను వదిలి పొట్టకూటి కోసం దేశ రాజధానికి వచ్చాడు. వేరే మార్గం లేక పనిలో చేరినా లక్ష్యం మాత్రం దృఢంగా ఉంది. పనితో పాటు లక్ష్యాన్ని చేరే మార్గం కనుగొన్నాడు. ఆ ప్రయాణం ఇప్పుడు దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నది. 

What A Guy: kevin Pietersen and Harbhajan Singh Reacts to The Viral Video of Indian Boy Who Runs 10 kms in Everyday night
Author
India, First Published Mar 22, 2022, 2:19 PM IST

విజయాలు ఊరికే రావు.  రాత్రి పడుకున్నాక కలలో కనిపించిన గెలుపు ఉదయం లేవగానే సాధ్యం కాదు. దాని కోసం తీవ్రంగా శ్రమించాలి. చాలా త్యాగం చేయాలి.  ప్రాణం పెట్టి పోరాడాలి.  అలా చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. అయితే విజయం కోసం చేసే పోరాటంలో ప్రయాణం చాలా గొప్పది. ఆ ప్రయాణంలోనే తన విజయాన్ని వెతుక్కుంటున్నాడు  ఓ 19 ఏండ్ల కుర్రాడు. రోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగివెళ్తూ.. పది కిలోమీటర్లు పరుగెడుతున్నాడు.   అంత రాత్రి ఆటోలు, బస్సులు ఉండవని అనుకుంటున్నారేమో.. అతడుండేది దేశ రాజధానికి ఆనుకుని ఉన్న నోయిడాలో.. దేశాన్ని తన మాటలతో స్ఫూర్తి నింపుతున్న ఈ వీడియో ఇప్పుడు క్రికెటర్లను కూడా  టచ్ చేసింది. 

ఈ వీడియోను బాలీవుడ్ డైరక్టర్  వినోద్ కప్రి షేర్ చేశాడు. ఉత్తరాఖండ్ లోని అల్మోరాకు చెందిన 19 ఏండ్ల ప్రదీప్.. కప్రి కార్లో వెళ్తుండగా అర్థరాత్రి పరుగులు తీస్తూ కనిపించాడు.  అతడిని గమనించిన  కప్రి.. లిఫ్ట్ ఇస్తానన్నాడు. కానీ అందుకు ప్రదీప్ నిరాకరించాడు.  

 

కప్రి, ప్రదీప్ ల సంభాషణ ఇలా సాగింది... 
కప్రి :  నేను నిన్ను డ్రాప్ చేస్తా రా.. కారెక్కు 
ప్రదీప్ : లేదు. నేను పరిగెడుతూ ఇంటికెళ్తాను. నాకిది అలవాటే..  
కప్రి : నువ్వు ఎక్కడ పని చేస్తావు...?
ప్రదీప్ : సెక్టార్ 16 (నోయిడా)లోని మెక్ డొనాల్డ్స్ లో పనిచేస్తాను. 
కప్రి : సరే.. రా నేను నిన్ను కార్ లో మీ ఇంటి దగ్గర దింపుతా.. నువ్వెందుకు ఇలా పరిగెడుతున్నావు. 
ప్రదీప్ : నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. 
కప్రి : నీది ఏ ఊరు..? 
ప్రదీప్ : ఉత్తరాఖండ్, అల్మోరా
కప్రి : నీ వయసెంత..?
ప్రదీప్ : 19 సంవత్సరాలు 
కప్రి : అమ్మవాళ్లు ఎక్కడ ఉన్నారు..?
ప్రదీప్ : ఊళ్లో. అమ్మ ఆస్పత్రిలో ఉంది. 
కప్రి : మరి నువ్వు ఇక్కడ ఎవరితో ఉంటున్నావు..?
ప్రదీప్ : మా అన్న నేను ఇద్దరం ఇక్కడే పనిచేస్తాం. 
కప్రి :  నేను ఇప్పుడు తీస్తున్న వీడియో వైరల్ అవుతుంది.. ఓకేనా..?
ప్రదీప్ : కానీవండి.. నన్నెవరూ గుర్తిస్తారు..?
కప్రి : ఒకవేళ వైరల్ అయితే..? 
ప్రదీప్ : పర్లేదు. నేనేమీ తప్పు చేయడం లేదు కదా. 
కప్రి : రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరిగెడతావ్..? 
ప్రదీప్ : రోజూ పది కిలోమీటర్లు రన్ చేస్తా.. సెక్టార్ 16 నుంచి బరోలా వరకు.. రోజూ రాత్రి ఇలాగా రూమ్ కు చేరతా.. 
కప్రి : మరి  ఎప్పుడు తింటావ్..? 
ప్రదీప్ :  రూమ్ కు వెళ్లాక నేనే తయారుచేసుకుంటా... 

 

ఈ వీడియో క్లిప్ ను కప్రి షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయింది.  బాలీవుడ్ తారలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ప్రదీప్ మెహ్రా ను ప్రశంసల్లో ముంచెత్తారు.

ఇక తాజాగా ఇదే వీడియోను కెవిన్ పీటర్సన్, హర్భజన్ సింగ్ కూడా తమ ట్విట్టర్లో షేర్ చేశారు. పీటర్సన్ షేర్ చేస్తూ.. ‘వాట్ ఎ గై..’ అని ట్వీట్ చేయగా భజ్జీ స్పందిస్తూ.. ‘ఛాంపియన్లు ఇలా తయారవుతారు.  అది క్రీడల్లో అయినా జీవితంలో అయినా.. అతడు విజేత.. ఈ వీడియో షేర్ చేసినందుకు థ్యాంక్స్ కప్రి.. అవును నిజమైన బంగారం..’ అని రాసుకొచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios