Asianet News TeluguAsianet News Telugu

ఆర్మీ క్యాప్ తో అమరవీరులకు టీమిండియా నివాళి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.

Watch: Indian cricket team wear Army caps, donate match fees as tribute to armed forces
Author
Hyderabad, First Published Mar 8, 2019, 1:48 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.

ఆర్మీ క్యాపులను ధరించి బరిలోకి దిగిన కోహ్లీ సేన.. ల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించింది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లి ఫీల్డింగ్‌వైపు మొగ్గుచూపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరజవాన్లు, వారి కుటుంబాలు దేశానికి చేసిన సేవకు చిహ్నంగా ఈ మ్యాచ్‌లో ఆర్మీక్యాప్‌లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్‌ ఫీజును నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాంటి మార్పుల్లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. లెప్టనెంట్‌ కల్నల్‌ హోదా లో ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్‌లు అందజేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఇక ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజును నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌ ద్వారా అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios