Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీతో నన్ను పోల్చకండి.. పాక్ క్రికెటర్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనను పోల్చవద్దని కోరుతున్నాడు  పాక్ క్రికెటర్ బాబర్ ఆజం. 

Watch: Babar Azam opens up on comparison with Virat Kohli
Author
Hyderabad, First Published Feb 13, 2019, 3:46 PM IST

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనను పోల్చవద్దని కోరుతున్నాడు  పాక్ క్రికెటర్ బాబర్ ఆజం. ఒక క్రికెటర్ బాగా ఆడుతున్నాడంటే.. అతనిని అంతకముందు సీనియర్ క్రికెటర్లతో పోల్చడం సహజం. విరాట్ కోహ్లీని కూడా స్టీవ్ స్మిత్, కేన్ విలయమ్స్ లాంటి క్రికెటర్లతో పోల్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ టాపార్డర్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం ఆటను కోహ్లీ ఆటతోపోల్చారు.

కాగా.. దీనిపై బాబర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్ తో తనను పోల్చవద్దని కోరాడు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాబర్ ఆంజను.. కోహ్లీతో మిమ్మల్ని పోల్చడం పై మీ స్పందన ఏంటని మీడియా ప్రశ్నించింది. దానికి అతను స్పందించాడు. చాలా మంది నా ఆటను కోహ్లీతో పోల్చుతూ ఉంటారని అన్నాడు.

కానీ.. కోహ్లీ చాలా గొప్పప్లేయర్ అని..తాను అతని దరిదాపుల్లో కూడా లేనని చెప్పారు. తన కెరీర్ ఇప్పుడు మొదలైందని గుర్తు చేశారు. కానీ కోహ్లీ మాత్రం ఇప్పటికే చాలా సాధించేశాడన్నాడు. భవిష్యత్తులో మాత్రం కోహ్లీలాగా రికార్డులు సాధించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios