ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇది అయిపోగానే.. వెంటనే వరల్డ్ కప్ మొదలౌతుంది. అయితే.. త్వరలో జరగనున్న ఈ వరల్డ్ కప్ లో కొత్త రూల్ ప్రవేశపెట్టారు. ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచక్‌ప నకు భారత క్రికెటర్లు తమ వెంట భార్యలు, ప్రియురాళ్లను తీసుకుని వెళ్లే విషయంలో బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. 

దీంతో నెలన్నర పాటు జరిగే వన్డే వరల్డ్‌క్‌పలో కేవ లం 15 రోజులే వారితో గడిపే అవకాశం ఉంది. అది కూడా పర్యటన ప్రారంభమైన మొదటి 20 రోజుల వరకు కుటుంబ సభ్యు లు ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం లేదు. గతంలో తొలి రెండు వారాల తర్వాత అనుమతించేవారు. 

అంతేకాకుండా మ్యాచ్‌లకు వెళ్లేటప్పు డు ఆటగాళ్ల బస్‌లో వారి కుటుంబ సభ్యులు వెళ్లడానికి కూడా వీల్లేదు. మరో ప్రత్యేక వాహనంలో మాత్రమే వెంట వెళ్లాల్సి ఉంటుంది. మే 22న ఇంగ్లండ్‌ వెళ్లనున్న భారత జట్టు రెండు లీగ్‌ మ్యాచ్‌లను ఆడనుంది. 31 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.