టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డారు. తన భార్యతో కలిసి దిగిన ఫోటోని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ ఫోటోకి పాజిటివ్ గా కంటే.. నెగిటివ్ గా స్పందించిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఇటీవల సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. త్వరలో రెండో వన్డే జరగనుంది. టీమిండియా సభ్యులంతా ఆ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. కోహ్లీ కాస్త మ్యాచ్ నుంచి విరామం దొరకగానే.. తన భార్య,బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మకి సమయం కేటాయించాడు. 

భార్యతో కలిసి దిగిన ఫోటోని హార్ట్ సింబల్ తో పోస్టు చేశాడు. అయితే.. ఇప్పటికే తొలి వన్డే టీం ఇండియా ఓడిపోయిందన్న ఫ్రస్టేషన్ లో ఉన్న అభిమానులు.. దొరికిందని సందని.. విరాట్ పై విరుచుకుపడ్డారు. అనుష్క మీద దృష్టి తగ్గించి.. మ్యాచ్ మీద పెట్టాలంటూ హితవు పలికారు. మరికొందరేమో.. వ్యగ్యంగా.. ఓహో రెండో వన్డే కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారా అంటూ కామెంట్ చేశారు. మరి కొందరు.. కనీసం రెండో వన్డే అయినా గెలవండి బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు.

ఇంకొందరు నెక్ట్స్ మ్యాచ్ లో విన్నింగ్ సెంచరీ కావాలంటూ ట్వీట్ చేయగా.. ఇంకొకరు.. ఓ మీరు నెక్ట్స్ మ్యాచ్ లో ఆడటం లేదా అంటూ ట్వీట్లు చేశారు. గత మ్యాచ్ లో కోహ్లీ కేవలం మూడు పరుగులు చేసి ఔట్ అయ్యాడనే కారణంతోనే వీళ్లు ఇలా ట్వీట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.