టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మన దేశంలోనే కాదు... పరాయి దేశంలో కూడా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అనుభవం ఉన్న క్రికెటర్ ని కలిసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? అందుకే... విరాట్ ని చూసేందుకు జనం ఎగపడ్డారు. అంతటి క్రేజ్ ని విరాట్ కూడా ఊహించలేదు. వారి ప్రేమకు ఫిదా అయి పోయిన కోహ్లీ... సంతోషంతో ఓ వీడియోని షేర్ చేశాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే...మరికొద్ది రోజుల్లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. కాగా...ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు ముందు కోహ్లీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీని చూడటానికి అభిమానులు వేలసంఖ్యలో తరలి వచ్చారు.

ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తెలియజేస్తూ... తనపై ఇంత ప్రేమ చూపించిన అభిమానులకు దన్యవాదాలు తెలియజేశాడు. ‘వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లేముందు.. నాకో విచిత్ర అనుభవం ఎదురైంది. ముంబయిలో జరిగిన ఫిలిప్స్‌ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇది చాలా అద్భుతంగా అనిపించింది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కోహ్లీని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ మొత్తం కిక్కిరిసిపోయింది. ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ గట్టిగా అరుస్తూ అభిమానులు తమ ప్రేమని చాటుకున్నారు.